వేర్లు కనిపించేలా పెంచేస్తున్నారు!

మొక్కల పెంపకం అంటే ఇష్టపడని వారెవరు? అయితే, స్థలం లేక కొందరు, ఓపిక లేక మరికొందరూ వీటికి దూరంగా ఉంటారు. ఇలాంటివారికోసమే పుట్టుకొచ్చింది అక్వాటిక్‌ ట్రెండ్‌.

Published : 19 Apr 2023 00:32 IST

మొక్కల పెంపకం అంటే ఇష్టపడని వారెవరు? అయితే, స్థలం లేక కొందరు, ఓపిక లేక మరికొందరూ వీటికి దూరంగా ఉంటారు. ఇలాంటివారికోసమే పుట్టుకొచ్చింది అక్వాటిక్‌ ట్రెండ్‌. మట్టి లేకుడా నీళ్లతో పెంచడమే దీని ప్రత్యేకత. ఇందుకోసం వేర్లు స్పష్టంగా కనిపించడానికి గాజు సీసాలను ఎంచుకుంటారు. మొక్క నిలబడేందుకు గాజు, పింగాణీ వంటివాటితో చేసిన స్ప్రౌటర్స్‌ని వాడుతున్నారు. వీటిల్లో ఆకుకూరల నుంచి కాక్టస్‌ రకాల వరకూ అన్నింటినీ పెంచేయొచ్చట. అందుకే ఇప్పుడివి భోజనాల బల్ల, టీపాయ్‌, ఆఫీసు డెస్క్‌ వంటివాటిపైకి చేరాయి. ఈ బుజ్జి మొక్కల్ని చూసి మురిసిపోని మనసుంటుందా చెప్పండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని