చలువ.. ఎరువులు
ఈ మండుటెండలకు పచ్చని మొక్క కూడా సాయంత్రానికి వడలిపోయినట్లు కనిపిస్తుంది. దానికి పరిష్కారమే చల్లని ఎరువులు! ఇవి మొక్కలను పచ్చగా ఉంచుతాయి. వీటిని ఇంట్లోనే చేసుకోవచ్చు తెలుసా!
ఈ మండుటెండలకు పచ్చని మొక్క కూడా సాయంత్రానికి వడలిపోయినట్లు కనిపిస్తుంది. దానికి పరిష్కారమే చల్లని ఎరువులు! ఇవి మొక్కలను పచ్చగా ఉంచుతాయి. వీటిని ఇంట్లోనే చేసుకోవచ్చు తెలుసా!
కూరగాయలు, పండ్ల తొక్కలు, వంటింటి వ్యర్థాలలో పోషకాలు నిండుగా ఉంటాయి. ఈ వేసవిలో ఎక్కువగా తీసుకొనే పుచ్చకాయ, దోస తొక్కలను వృథాగా పడేయకూడదు. వీటన్నింటినీ కలిపి రెండుమూడు రోజులు నీటిలో నానబెట్టాలి. రోజుకొకసారి ఈ నీటిని కర్రతో కలియబెడుతూ ఉండాలి. 3 రోజుల తర్వాత ఈ నీటిని వడకట్టాలి. పొటాషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు సహా సూక్ష్మ పోషకాలతో ఎరువుగా మారిన ఈ నీటిని మొక్కలకు ఉదయం ఎండ రాకముందే అందించాలి. .
ఆవుపేడతో.. ఒక బకెట్‌లో 7 లీటర్ల నీటిని తీసుకొని ఆవుపేడను కలిపి మూత పెట్టాలి. 3 రోజుల తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలియబెట్టి ఉదయాన్నే మొక్కలకు పోస్తే, వేసవిని తట్టుకొంటాయి. పేడలో ఉండే ప్రత్యేక సూక్ష్మజీవులు, మంచి బ్యాక్టీరియాలు మొక్కను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి మట్టిలోని పోషకాలను వేర్లు తేలికగా పీల్చుకోవడానికి దోహదపడతాయి. ఈ ఎరువు మట్టిని గుల్లగా ఉంచుతుంది. అలాగే మొక్కల తొట్టెలను బాగా ఎండ పడేచోట కాకుండా మధ్యాహ్నం నీడవైపు మార్చడం మంచిది. తోటలో మొక్కలైతే ఈ పద్ధతిలో ఎరువును వేసి పరిసర ప్రాంతంలోనూ చెమ్మ ఉండేలా చూస్తే వేసవిలోనూ చిగురిస్తాయి.
కడుగునీటితో.. బియ్యం, పప్పులు కడిగిన నీటిని ఒక బకెట్‌లో భద్రపరచాలి. ఇందులో అరటిపండు, నిమ్మ తొక్కలను వేసి 3 రోజులు నాననివ్వాలి. ఆ తర్వాత తొక్కలను వడకట్టిన నీటిని బాగా కలియబెట్టి మొక్కకు పోయాలి. ఇందులోని క్యాల్షియం మట్టిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచి మొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. మెగ్నీషియం మొక్కకు ఫొటోసింథసిస్‌లో సహాయపడితే, సల్ఫర్ వేర్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ఎరువు మట్టిలో ఖనిజలవణాలు, పోషకాల శాతాన్ని పెంచి మొక్కను ఆరోగ్యవంతంగా చేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.