ఈ తప్పులు మీరూ చేస్తున్నారా!

మొక్కలు పెంచాలని అందరికీ ఉంటుంది. మొదలుపెడతారు కూడా. కానీ వాటిని సరిగ్గా పెంచలేక మధ్యలోనే చేతులెత్తేస్తుంటారు. ఈ చిన్న తప్పులు చేయకుండా ఉంటే అందమైన వనాన్ని తయారు చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.

Published : 23 Apr 2023 00:28 IST

మొక్కలు పెంచాలని అందరికీ ఉంటుంది. మొదలుపెడతారు కూడా. కానీ వాటిని సరిగ్గా పెంచలేక మధ్యలోనే చేతులెత్తేస్తుంటారు. ఈ చిన్న తప్పులు చేయకుండా ఉంటే అందమైన వనాన్ని తయారు చేసుకోవచ్చంటున్నారు నిపుణులు..

మట్టి ఎంపికలో.. మనం ఎంచుకునే మట్టిని బట్టే మొక్క ఎదుగుదల ఉంటుంది. చాలా వరకు మొక్కలు ఎదగకపోవడానికి కారణం సరైన మట్టి ఎంచుకోకపోవడమే. అందుకే మనం ఎంచుకునే మట్టిలో తేమ, సేంద్రియ పదార్థాలు అన్నీ సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి.

రసాయనాలు.. మొక్కలకు చీడ పట్టిందన్న కారణంతో ఎక్కువ క్రిమిసంహారకాలు వాడుతుంటాం. అలా చేస్తే చెడు కీటకాలతో పాటు మంచివి కూడా చనిపోతాయి. వాటి స్థానంలో కొత్త రకం కీటకాలు చేరి మొక్కలను నాశనం చేస్తాయి. చీడపీడలు మరీ ఎక్కువగా ఉంటే తప్ప రసాయన ఎరువులు వాడొద్దు.

కలుపు మొక్కలు.. చాలామంది కలుపు మొక్కల భయంతోనే అసలు తోటే పెంచకూడదనుకుంటారు. అలాకాకుండా మల్చింగ్‌ విధానంలో మొక్కలు పెంచినట్లయితే కలుపు వంటివి దరిచేరవు.

ఓపికతోనే... మొక్కలు బాగా పెరగాలని ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేవారూ ఎంతోమంది. ఒకవేళ అనుకున్నట్లు అవి పెరగకపోతే నిరుత్సాహపడతారు. ఓపిగ్గా ఉంటేనే మంచి ఫలితాలు అందుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్