అతిథులకు ఆహ్లాదంగా..
ప్రత్యేక సందర్భాలు.. పండగలు వచ్చినప్పుడు అతిథులను ఆహ్వానిస్తే మాత్రం ఇంటిని సర్దినట్లే భోజన బల్లనూ ప్రత్యేకంగా సర్దాల్సిందే. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి మరీ గౌరవ మర్యాదలిస్తే చాలు. వారికి ఓ మంచి జ్ఞాపకాన్ని అందించిన వాళ్లమవుతాం.
ప్రత్యేక సందర్భాలు.. పండగలు వచ్చినప్పుడు అతిథులను ఆహ్వానిస్తే మాత్రం ఇంటిని సర్దినట్లే భోజన బల్లనూ ప్రత్యేకంగా సర్దాల్సిందే. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి మరీ గౌరవ మర్యాదలిస్తే చాలు. వారికి ఓ మంచి జ్ఞాపకాన్ని అందించిన వాళ్లమవుతాం.
* అతిథులకు ఇష్టమైన ఆహారానికి ప్రాముఖ్యతనివ్వడం కన్నా, మీకు తెలిసిన ప్రత్యేకమైన, పిలిచిన సందర్భానికి తగ్గట్లు వంటకాలను వండి ప్రేమగా వడ్డించండి. మీ ఆతిథ్యాన్ని వారు మరవలేరు.
* భోజనబల్ల అలంకరణకూ పెద్దపీట వేయాలి. వచ్చేవారి సంఖ్యను బట్టి కుర్చీలుండేలా చూడాలి. రాత్రి సమయాల్లో అయితే మెరిసేలా కుషన్ కవర్లు వేయాలి. అదే పగటిపూట భోజనానికి వస్తున్నట్లైతే లేతవర్ణాల కవర్లపై ఎంబ్రాయిడరీ ఉంటే చూడముచ్చటగా ఉంటుంది.
* బల్లపై టొమాటో, క్యారెట్ వంటివాటితో పూలను తయారుచేసి అలంకరిస్తే సహజ సిద్ధంగా అనిపిస్తుంది. భోజనబల్లకే ప్రత్యేకమైన కళ వస్తుంది. కుర్చీల కవర్లకు మ్యాచ్ అయ్యేలా డిన్నర్ సెట్‌నుంచితే ప్రత్యేకంగా ఉంటుంది.
* డిన్నర్‌లో టేబుల్‌ను మరింత మెరిసేలా చేయొచ్చు. వంటకాల నడుమ మెరిసే కొవ్వొత్తుల వెలుతురులుండేలా చూడాలి. అలాగే బల్ల మధ్యలో రెండు మూడు ఇండోర్ ప్లాంట్స్, తాజాపూల వాజ్‌లు సర్దితే చాలు. వాతావరణమంతా పరిమళ భరితమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.