పని పోగు పడొద్దంటే..
‘ఉదయాన్నే చిరుబుర్రులేంటి..’ ఇంట్లోవాళ్ల నుంచి ఎన్నిసార్లు ఈ మాట వినుంటాం? గిన్నెలతో నిండిన సింకు, గజిబిజిగా దుస్తులు, తడిచిన తువాళ్లు, మడత పెట్టని దుప్పట్లు.. చిందర వందరగా ఉన్న సోఫా కవర్లు.
‘ఉదయాన్నే చిరుబుర్రులేంటి..’ ఇంట్లోవాళ్ల నుంచి ఎన్నిసార్లు ఈ మాట వినుంటాం? గిన్నెలతో నిండిన సింకు, గజిబిజిగా దుస్తులు, తడిచిన తువాళ్లు, మడత పెట్టని దుప్పట్లు.. చిందర వందరగా ఉన్న సోఫా కవర్లు.. వీటన్నింటినీ చూస్తే విసుగు కాక ఏమొస్తుంది? మరేం చేద్దాం.. ఇలా ప్రయత్నిద్దాం.
* అందరికంటే ముందు లేచి పనిలో పడిపోతాం. కాబట్టి, దుప్పట్లు వెంటనే సర్దేయలేం. మరీ చిన్నపిల్లలైతే తప్ప లేవగానే ఎవరికి వారు కప్పుకొన్నవి మడత పెట్టేలా చూడండి. పిల్లలకు దిండ్లను సక్రమంగా పెట్టడం, పక్కను తిన్నగా చేయడం వంటివి నేర్పితే సరి. గజిబిజిగా ఉన్న స్థలం మరింత చెత్త చేరేలా చేస్తుందట. అదే నీట్‌గా ఉంటే దాన్ని పాడు చేయడానికి ఎవరికీ మనసొప్పదు. అలా ఎక్కడి వస్తువులు అక్కడికి చేరిపోతాయన్నమాట.
* వంట చేసేప్పుడు అలమరాల్లో ఉన్న వస్తువులన్నీ పొయ్యి గట్టు మీదకి చేరిపోతుంటాయి. అంతా పూర్తయ్యాక సర్దుకుందాం అనుకుంటే అదింకో పనిలా కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు తీసి సర్దేయండి. కూరగాయలు కడిగిన గిన్నె, తరిగిన ముక్కలుంచిన ప్లేటు వంటివి సింకులో పడేయక వెంటనే తొలిపి పక్కన పెట్టేయండి. నూనె, కూర వంటివి స్టవ్, గట్టు మీద పడితే వాటినీ అప్పుడే తుడిచేయండి. తర్వాత ఎండిపోయి మొండిగా తయారవుతాయి. పైగా అదనపు శ్రమ.
* ఇల్లు అందంగా కనిపించాలనీ.. ఆఫర్ల పేరుతో గృహాలంకరణ వస్తువులు కొంటుంటాం. చూడటానికి బాగానే ఉంటుంది. శుభ్రం చేసేప్పుడే విసుగొస్తుంది. అందుకే తరచూ చేయం. తీరా ఒక్కసారే చేయాల్సొస్తే అనవసర భారం. మరీ అవసరం అనుకున్నవి ఉంచి, మిగతా వాటిని తీసేయండి. శుభ్రతకు మించిన అందముండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.