పరిమళాలను పెంచేయండి!

ఇంట్లో సువాసనల కోసం ఫ్రెష్‌నర్లు వాడుతుంటాం. కానీ వాటిలోని రసాయనాలు అనారోగ్యాల్ని తెచ్చిపెట్టగలవు. అందుకే... గులాబీ.. పూలు కంటికి అందాన్ని ఇవ్వడమే కాదు.. వీటి సువాసనలు ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమినీ దూరం చేయగలవు. బాల్కనీలో చిన్న మొక్కను ఉంచండి.

Published : 28 Apr 2023 00:40 IST

ఇంట్లో సువాసనల కోసం ఫ్రెష్‌నర్లు వాడుతుంటాం. కానీ వాటిలోని రసాయనాలు అనారోగ్యాల్ని తెచ్చిపెట్టగలవు. అందుకే...

గులాబీ.. పూలు కంటికి అందాన్ని ఇవ్వడమే కాదు.. వీటి సువాసనలు ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమినీ దూరం చేయగలవు. బాల్కనీలో చిన్న మొక్కను ఉంచండి. సాయంకాలాల్లో కుండీని ఇంట్లోకి తెచ్చినా.. బాల్కనీ తలుపు తెరచి ఉంచినా ఇల్లంతా సువాసనలతో నిండిపోతుంది. తరచూ నీళ్లు అందించాలి. ఇంకా నీటిలో కలిపిన పురుగుమందు నెలకోసారి చల్లితే మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది.

మల్లె.. వేసవిలో మల్లెలు బాగా పూస్తాయి. చిన్న మొక్క తెచ్చి బాల్కనీలో వేలాడదీస్తే సరి! ఇల్లంతా సువాసనలతో నిండిపోతుంది. ఏడాది పొడవునా పూయాలంటే సన్నజాజి, కాగడ మల్లె వంటి రకాలను తెచ్చుకోవాలి.

పీస్‌ లిల్లీ.. వీటిని ఇంటిలోనూ పెంచొచ్చు. నేరుగా ఎండ తగలకుండా చూసుకుంటే సరిపోతుంది. కుండీలో మట్టి మరీ ఎండిపోయినట్లుగా అయినప్పుడు నీటినిస్తే చాలు. ఆకులు వడలినట్లుగా అవుతుంటేనే ఎరువు అవసరం. తెల్లగా ఆకులా ఉండే ఈ పువ్వు ఏడాదంతా పూస్తుంది. మొక్క గాలిని శుభ్రపరిస్తే.. పూల సువాసనలు తేలిగ్గా నిద్రపట్టేలా చేస్తాయి.

ట్యూబ్‌ రోజ్‌.. రజనీగంధగా పిలిచే ఈ మొక్కకి ఎండ కావాలి. పగలంతా సూర్యుడి పొడ పడేలా ఉంచి, సాయంత్రం ఇంట్లోకి తెచ్చుకోవచ్చు. త్వరగా పెరుగుతుంది. మట్టి పూర్తిగా ఎండిపోకుండా చూసుకుంటే చాలు. ప్రతి ఆరువారాకొకసారి నత్రజని, ఫాస్ఫరస్‌, పొటాషియం సమపాళ్లలో కలిపి అందిస్తుండాలి. ఒత్తిడిగా, డిప్రెషన్‌లో ఉన్నట్లు అనిపిస్తే దీని సువాసనలు చూస్తే సరి. మనసు తేలికపడిన భావన కలుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్