వేసవిలో మొక్కల సంరక్షణ..

ఈ ఎండల్లో మొక్కల్ని కాపాడుకోవడానికి కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిందే. కానీ, ఎక్కువ సమయం, శక్తి వినియోగించలేం అనుకునేవారు...ఈ చిట్కాలను పాటించి చూడండి.

Published : 08 May 2023 00:15 IST

ఈ ఎండల్లో మొక్కల్ని కాపాడుకోవడానికి కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిందే. కానీ, ఎక్కువ సమయం, శక్తి వినియోగించలేం అనుకునేవారు...ఈ చిట్కాలను పాటించి చూడండి.

* వేసవి కాబట్టి రోజు మొత్తం కుండీలో ఉన్న మట్టి తడిగా ఉండేలా చూసుకోవాలి. సూర్యోదయానికి ముందే కానీ సూర్యాస్తమయం తర్వాత కానీ మొక్కలకు నీళ్లు పట్టాలి. అప్పుడే అవి ఆరోగ్యంగా ఉంటాయి. ఎరువులను వేయడానికీ ఇదే సూత్రాన్ని పాటించాలి.

* మొక్కల వేర్లకు నేరుగా ఎండ తగలకుండా ఉండేందుకు మొదళ్ల దగ్గర మల్చింగ్‌ చేయాలి. అంటే...ఎండిన ఆకులూ, పేపర్‌, చెక్కపొడి వంటివి వేసి షీట్‌తో వేర్లను కప్పి ఉంచడమే. దీనివల్ల ఎండ ప్రభావం ఉండదు.

* చిన్న, పెద్ద మొక్కల్ని కలిపి పెంచాలి. అప్పుడే పెద్ద చెట్ల నీడ చిన్న వాటిపై పడుతుంది. యూవీ కిరణాలు నేరుగా చిన్న మొక్కలపై పడవు.. దాంతో మొక్కలు ఎండిపోయే సమస్య కూడా దూరమవుతుంది.

* ఎండిన కొమ్మల్ని, పురుగు పట్టిన ఆకుల్ని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. లేకపోతే నీటిని ఎక్కువగా పీల్చుకోవడమే కాక, చీడ పీడలు మిగిలిన మొక్కలకు అంటుకుంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని