పరుపుపై మరకలా..!
పక్క దుప్పటి తీస్తే పరుపు మీద మరకలు కనిపిస్తాయని ఇల్లాళ్లు భయపడుతుంటారు. పిల్లలు మాట వినకో.. మన అజాగ్రత్త వల్లో వీటిని తప్పించుకోవడం అసాధ్యం. ఇలాంటప్పుడు ఈ చిట్కాలు పనిచేస్తాయి.
పక్క దుప్పటి తీస్తే పరుపు మీద మరకలు కనిపిస్తాయని ఇల్లాళ్లు భయపడుతుంటారు. పిల్లలు మాట వినకో.. మన అజాగ్రత్త వల్లో వీటిని తప్పించుకోవడం అసాధ్యం. ఇలాంటప్పుడు ఈ చిట్కాలు పనిచేస్తాయి.
* అసలే వేసవి.. ఏసీ ఉంటే సరే! లేదంటే ఫ్యాను ఎంత స్పీడు మీద పెట్టినా చెమట నుంచి అన్నిసార్లూ తప్పించుకోలేం. ఒక్కోసారి పిల్లలు పక్క తడిపేస్తుంటారు. ఇలాంటి మరకల్ని వదిలించాలంటే... పావుకప్పు హైడ్రోజన్ పెరాక్సైడ్‌కి మూడు స్పూన్ల బేకింగ్ సోడా, కొద్దిగా లిక్విడ్ డిష్‌వాష్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో పోసి ఉంచుకోవాలి. ముందుగా మరక ఉన్న ప్రదేశాన్ని గోరువెచ్చని నీటితో తడపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లి, టూత్‌బ్రష్‌తో రుద్దాలి. ఆపై మరోసారి గోరువెచ్చని నీటిని చల్లి మెత్తని వస్త్రంతో తుడిస్తే సరి.
* వద్దన్నా పిల్లలు మంచం మీద కూర్చొని తింటుంటారు. ఆహార పదార్థాలూ వాటి తాలూకు నూనెలు, పానీయాలు వంటివి పొరపాటున మంచంపై పడుతుంటాయి. ఆ మొండి మరకలు ఓ పట్టాన వదలవు. అప్పుడు ఒక స్ప్రే బాటిల్ తీసుకొని 2కప్పుల నీళ్లు, పావుకప్పు చొప్పున లిక్విడ్ డిటర్జెంట్, వైట్ వెనిగర్‌లను తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని మరకలు పడ్డ చోట చల్లి కొద్దిసేపు వదిలేయండి. తర్వాత తడి వస్త్రంతో అద్దితే చాలు.
* రక్తం మరకలా? పావుకప్పు హైడ్రోజన్ పెరాక్సైడ్‌కు స్పూను చొప్పున లిక్విడ్ డిష్‌వాష్, ఉప్పు కలిపి మందపాటి పేస్ట్‌లా చేయాలి. దాన్ని పలుచని పొరలా మరకపై రాసి, పూర్తిగా ఆరనిచ్చి తడి వస్త్రంతో తుడిచేస్తే సరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.