పచ్చదనాల సోయగం

చాలామందికి ఇళ్లల్లో మొక్కల్ని పెంచుకోవాలని ఉంటుంది. కానీ ఇండోర్‌ ప్లాంట్స్‌ అంటే చాలా కష్టమైన వ్యవహారం లెమ్మనుకుంటారు. ఆ భయంతో తమ సరదాని అటకెక్కిస్తారే తప్ప వాటి జోలికెళ్లరు. మీరూ అంతేనా?! అయితే శ్రమించాల్సిన అవసరం లేకుండా తేలిగ్గా పెరిగే ఈ మొక్కల్ని ప్రయత్నించండి.

Published : 10 May 2023 00:23 IST

చాలామందికి ఇళ్లల్లో మొక్కల్ని పెంచుకోవాలని ఉంటుంది. కానీ ఇండోర్‌ ప్లాంట్స్‌ అంటే చాలా కష్టమైన వ్యవహారం లెమ్మనుకుంటారు. ఆ భయంతో తమ సరదాని అటకెక్కిస్తారే తప్ప వాటి జోలికెళ్లరు. మీరూ అంతేనా?! అయితే శ్రమించాల్సిన అవసరం లేకుండా తేలిగ్గా పెరిగే ఈ మొక్కల్ని ప్రయత్నించండి. మీ ఇంట్లో సౌందర్యం విరగపూస్తుంది..

ముత్యాల తీగ  

కుపచ్చ ముత్యాల దండలా ఎంత ముచ్చటగా ఉంటుందో ఈ మొక్క! దీనికింకో పేరు సెనెసియో రౌలేయనస్‌. ఈ మొక్కకు సూర్యరశ్మి అవసరం లేదు. ఇంట్లో ఎక్కడ పెట్టినా అందంగా పెరుగుతుంది. సీలింగుకు కొక్కెం కట్టి కుండీని వేలాడదీస్తే ఇల్లెంత కళగా ఉంటుందో! ఈ స్ట్రింగ్‌ ఆఫ్‌ పెర్ల్స్‌ మొక్కకి మట్టి గుల్లగా ఉండాలి, నీళ్లు తక్కువ పోయాలి.


ప్రేయర్‌ ప్లాంట్‌

దీని ఆకులు ప్రార్థిస్తున్న చేతులను పోలి ఉంటాయని కాబోలు ఆ పేరు పెట్టారు. లేత, ముదురాకుపచ్చల కలయికతో, మధ్యలో పొగాకు రంగు ఈ నెలతో చిత్రకారుడు వేసిన అమోఘ చిత్రంలా ముగ్ధమోహనంగా ఉంటుందీ మొక్క. ప్రేయర్‌ ప్లాంట్‌కి ఎక్కువ కొమ్మలు, లెక్కలేనన్ని ఆకులూ ఉండవు. ఒక్కో కాడకు ఒక పత్రం చొప్పున మహా అయితే పది ఆకులుంటాయి. కానీ అందం మాత్రం అనంతం. ఈ మొక్కను గమనిస్తూ కూర్చుంటే మనసులో చిరాకులన్నీ మాయమైపోవాల్సిందే.


చైనీస్‌ వాటర్‌ బ్యాంబూ

ది మట్టిలోనే కాదు, నీళ్లలోనూ పెరుగుతుంది. కాండం వెదురును పోలి ఉంటుంది. మొక్క మొదట్లో చిన్న చిన్న రంగు రాళ్లను పరిస్తే మరింత ముచ్చటగొల్పుతుంది. నీళ్లలో పెంచేట్లయితే వారానికోసారి తప్పనిసరిగా నీళ్లను మార్చాలి. ఈ చైనా నీటి వెదురు మొక్కని అదృష్టంగా భావిస్తూ లక్కీ ప్లాంట్‌ అని పిలుచుకుంటారు. చాలామంది తాము పెంచుకోవడమే కాకుండా బంధుమిత్రులకూ కానుకగా ఇస్తుంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని