వంట గట్టు మెరిసేలా..
ఇంట్లో అన్ని ప్రాంతాల్లాగే వంటగట్టు కూడా అతి ముఖ్యమైన ప్రదేశంమే. అది శుభ్రంగా లేకపోతే పని కూడా చేయాలనిపించదు. దానికి తోడు చీమలు, ఈగలు వచ్చి చేరతాయి.
ఇంట్లో అన్ని ప్రాంతాల్లాగే వంటగట్టు కూడా అతి ముఖ్యమైన ప్రదేశంమే. అది శుభ్రంగా లేకపోతే పని కూడా చేయాలనిపించదు. దానికి తోడు చీమలు, ఈగలు వచ్చి చేరతాయి. దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి శుభ్రం చేసుకోవాలి కదా.. దాని కోసం కొన్ని చిట్కాలు చదివేయండి మరి...
* వంట పూర్తవగానే పొయ్యి గట్టుని శుభ్రం చేస్తే చూడటానికి చక్కగా ఉంటుంది. చిందుర్లు, నూనె మరకలు పడితే వంట అవ్వగానే తుడిచేయాలి. దానికోసం వెనిగర్ కలిపిన నీళ్లైతే మంచిది. వెంటనే అయితే పనీ తేలిక అవుతుంది. దాంట్లో న్యాప్‌కిన్ ముంచి తుడిస్తే చీమలు, దోమలను కూడా దరి చేరనివ్వదు.
* కూరగాయలు తరిగిన తర్వాత వాటి చెత్త అంతా గట్టు పైన పేరుకుంటుంది. ఇప్పుడు కాదు వంట అంతా అయ్యాక పడేద్దామని అలాగే పెట్టకూడదు. వాటి తేమ, మరకలు క్యాబినెట్‌ని పాడుచేస్తాయి. తరిగేటప్పుడే వాటికోసం పక్కన ఓ డబ్బా పెట్టుకొని దాంట్లో వేసి తర్వాత చెత్తడబ్బాలో పడేస్తే పని సులువవుతుంది.
* బాగా మరకలు పేరుకుపోయిన గట్టు పైన బేకింగ్ సోడా వేసిన నీళ్లతో తుడిస్తే ఫలితం ఉంటుంది. దుర్వాసనా ఉండదు. దీన్ని శుభ్రం చేసేందుకు బ్లీచింగ్, అమోనియా లాంటివి అస్సలు వాడకూడదు. ఇవి ఉపయోగిస్తే క్యాబినేట్‌కున్న రంగులు, టైల్స్ దెబ్బతింటాయి.
* కిచెన్ గట్టుని తేమగా ఉంచకూడదు. వీలైతే చిమ్నీ లేదా వేడి బయటకు వెళ్లేందుకు, తడి ఆరిపోయేందుకు కిటికీకి ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను బిగిస్తే మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.