ఫ్రిజ్‌లో ఉంచినా.. పాడవుతాయ్‌!

ఆహార పదార్థాలు త్వరగా పాడవకూడదని ఫ్రిజ్‌లో పెడుతుంటాం. కొన్నిసార్లు వాటిని బయటపెట్టిన కొద్దిసేపటికే రుచి మారడం, పాడవడం గమనించారా? రుచి చూడకుండానే కొన్ని లక్షణాలతోనూ అవి పాడయ్యాయని చెప్పొచ్చిలా..  కూరగాయ ముక్కలు, మాంసం వంటివాటిని డీప్‌ ఫ్రిజ్‌లో ఉంచి తీసినప్పుడు చుట్టూ మంచు పేరుకొని...

Published : 16 May 2023 00:33 IST

ఆహార పదార్థాలు త్వరగా పాడవకూడదని ఫ్రిజ్‌లో పెడుతుంటాం. కొన్నిసార్లు వాటిని బయటపెట్టిన కొద్దిసేపటికే రుచి మారడం, పాడవడం గమనించారా? రుచి చూడకుండానే కొన్ని లక్షణాలతోనూ అవి పాడయ్యాయని చెప్పొచ్చిలా..

కూరగాయ ముక్కలు, మాంసం వంటివాటిని డీప్‌ ఫ్రిజ్‌లో ఉంచి తీసినప్పుడు చుట్టూ మంచు పేరుకొని ఉండటం గమనించారా? వాటిల్లోని నీరు బయటకు రావడం వల్ల ఇలా అవుతుంది. ఇది పాడవడానికి చిహ్నం కాదు. కానీ.. ఆ స్థితికి దగ్గరకి వచ్చినట్లే.

చాలామంది మాంసం, చేపలను నిల్వ చేస్తుంటారు. వాటి రంగు ఎరుపు కాకుండా వేరే రంగుల్లోకి మారిందంటే దాన్ని పక్కన పెట్టేయాల్సిందే. మాంసం నుంచి గులాబీ రంగులో ద్రవాలు వెలువడుతోన్నా పాడయ్యిందనడానికి చిహ్నమే. కూరగాయలు, పండ్లు తెచ్చినప్పటికంటే రంగు తగ్గినా తినొద్దు. ఆరోగ్యానికి హాని చేస్తాయి.

ఎంత డీప్‌ ఫ్రిజ్‌లో ఉంచినా విత్తనాలు, కూరగాయలు, పండ్ల ముక్కలు వంటివి జిగురుగా అనిపిస్తుంటాయి. వాసనా తేడా వస్తుంది. వాటిని ఇక చెత్త బుట్టకి చేర్చడమే మంచిది.

తుది గడువు ప్రింట్‌ చేసినా.. బటర్‌, మయనీజ్‌ వంటివి తెరిచిన ఇన్ని రోజుల్లోగా వాడాలి అని రాసుంటుంది. కానీ తెరిచింది మనం గుర్తుపెట్టుకోం. కాబట్టి, అలాంటివి వాడొచ్చో లేదో గుర్తించడం కష్టం. తీరా పాడైపోతే ఆరోగ్యానికి హాని. కాబట్టి, తెరిచిన రోజే డేట్‌ వేసుకొని ఉంచితే ఈ సమస్య ఉండదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని