ఇంటికి అందాన్నిచ్చే మొక్కలు

మనందరికీ ఇంటిని చక్కగా ముస్తాబు చేసుకోవాలని ఉంటుంది. అందుకోసం ఎన్నెన్నో కొంటాం. ఏవేవో అలంకరణ సామగ్రి పేరుస్తాం. నిజానికి వాటన్నిటినీ మించిన సోయగం మొక్కల్లో ఉంటుంది.

Published : 18 May 2023 00:07 IST

మనందరికీ ఇంటిని చక్కగా ముస్తాబు చేసుకోవాలని ఉంటుంది. అందుకోసం ఎన్నెన్నో కొంటాం. ఏవేవో అలంకరణ సామగ్రి పేరుస్తాం. నిజానికి వాటన్నిటినీ మించిన సోయగం మొక్కల్లో ఉంటుంది. ఇంటి శోభను పెంచడానికి ఆర్నమెంటల్‌ ప్లాంట్స్‌ మంచి ఎంపిక. ప్రయత్నించి చూడండి..

చైనీస్‌ మనీప్లాంట్‌... ఇంటా బయటా, మట్టిలో నీళ్ల్లల్లో అలవోకగా అల్లుకుపోయే మనీప్లాంట్‌ మనందరికీ సుపరిచితమే. కానీ చైనీస్‌ మనీప్లాంట్‌ కాస్త కొత్తది. ఈ ఆకుల్లోనే వింత అందం ఉందనుకుంటే ఆకుల కాడలే కొమ్మల్లా పొడుగ్గా ఉండి వింత శోభ ఉట్టిపడుతుంది. ఇది క్రీపర్‌ కాదు కనుక పాకేందుకు తాళ్లూ, ఊచలూ ఏర్పాటు చేయాల్సిన పనిలేదు.

జేడ్‌... దీన్ని ఇండోర్‌లోనూ ఔట్‌డోర్‌లోనూ కూడా పెంచుకోవచ్చు. కొంచెం గుబురుగా, దట్టంగా చిన్నపాటి పొదలా కనిపిస్తుంది. ఆకులు దళసరిగా ఉంటాయి. సూర్యరశ్మి ఎక్కువ సోకితే ఆకుల చివర ఎరుపు లేదా పసుపుపచ్చ రంగులో అంచులా ఏర్పడి ముచ్చటగొల్పుతూ దీనికి గులాబీ రంగు పూలు పూస్తాయి. చాలా తక్కువ నీళ్లు పోయాలి. ఇది ఇంట్లో ఉంటే కలిసొస్తుందని నమ్ముతూ కొందరు లక్కీప్లాంట్‌ అని పిలుచుకుంటారు.

ఆక్సాలిస్‌ ట్రయాంగ్యులరిస్‌... బ్రెజిల్‌కు చెందిన ఈ మొక్క ఇప్పుడు మనదేశంలో ఫాషనబుల్‌ ప్లాంట్‌గా ప్రశంసలు అందుకుంటోంది. ఇది షామ్రాక్‌ పేరుతోనూ ప్రసిద్ధం. ఆకులు ఊదా, కెంపు షేడ్స్‌లో త్రికోణాకృతిలో ఉంటాయి. పది వారాల్లో ఊదారంగు పూలతో అలరిస్తాయి. మొక్క ముదురు వర్ణంలో ఉంటుంది కనుక లేత ఛాయ గల కుండీలో పెంచితే అందం రెట్టింపవుతుంది. వీటికి సూర్యరశ్మి అవసరం కనుక ఎండ ఉన్నంతసేపూ బయట ఉంచి తర్వాత ఇంట్లోకి మార్చుకోవాలి. ఇది పెంపుడు జంతువులకు మంచిది కాదు కనుక వాటికి దూరంగా ఉండేట్లు చూసుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్