వార్డ్‌రోబ్.. తాజాగా.. పరిమళభరితంగా..!

ప్రత్యేకించి వేసవిలో వార్డ్‌రోబ్‌లో దుస్తులు అమర్చే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వివిధ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో- వార్డ్‌రోబ్ తాజాగా.. పరిమళభరితంగా.. ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు....

Published : 31 May 2023 20:53 IST

ప్రత్యేకించి వేసవిలో వార్డ్‌రోబ్‌లో దుస్తులు అమర్చే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వివిధ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో- వార్డ్‌రోబ్ తాజాగా.. పరిమళభరితంగా.. ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

వార్డ్‌రోబ్‌ ఎప్పుడూ తాజాగా, పరిమళభరితంగా ఉండాలంటే లావెండర్‌, జెరానియం.. వంటి అత్యవసర నూనెల్ని అప్పుడప్పుడూ అందులోని ఖాళీ అరల్లో స్ప్రే చేయచ్చు.

లావెండర్‌, జెరానియం, తులసి.. వంటి నూనెలు కలిపి తయారుచేసిన మిశ్రమాన్ని వార్డ్‌రోబ్‌లో ఓ మూలకు ఉంచడం వల్ల కూడా క్లోజెట్‌ సువాసనతో నిండిపోతుంది.

ఓ చిన్న గంధపు చెక్కను వార్డ్‌రోబ్‌ మూలలో ఉంచడం వల్ల కూడా అది పరిమళభరితంగా మారుతుంది.

సహజసిద్ధ పదార్థాలతో తయారుచేసిన సబ్బుల్ని ఒక సన్నటి కాటన్ క్లాత్‌లో చుట్టి వార్డ్‌రోబ్‌ కార్నర్‌లో అమర్చాలి. తద్వారా ఈ సబ్బుల నుంచి వెదజల్లే పరిమళాలు అల్మరా అంతా పరచుకుంటాయి.

చిన్న చిన్న రంధ్రాలున్న ఒక జార్‌లో కొన్ని కాఫీ గింజల్ని పోసి.. ఆ జార్‌ని వార్డ్‌రోబ్‌లో అమర్చినా అందులోని దుర్వాసనలు తొలగిపోయి.. క్లోజెట్‌ పరిమళభరితంగా మారుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని