ఇల్లంతా విహంగాలే...
పక్షుల కిలకిలరావాలు వినిపిస్తేనే చాలు.. మనసంతా ఆహ్లాదంగా మారుతుంది. అటువంటి వర్ణభరితమైన విహంగాలు బొమ్మలుగా ఇంటి అలంకరణలో భాగమైతే .. ఆ ఆనందమే వేరు. మరెలాగో చూద్దాం.
పక్షుల కిలకిలరావాలు వినిపిస్తేనే చాలు.. మనసంతా ఆహ్లాదంగా మారుతుంది. అటువంటి వర్ణభరితమైన విహంగాలు బొమ్మలుగా ఇంటి అలంకరణలో భాగమైతే .. ఆ ఆనందమే వేరు. మరెలాగో చూద్దాం.
రంగురంగుల పక్షులను ఇష్టపడనివారుండరు. అటువంటి వాటి బొమ్మలను గదిలో డిజైన్‌గా మార్చుకొంటే ఇల్లంతా కళకళలాడుతుంది. అందుకే ఇంటీరియర్ డిజైనర్లు ఈ రకమైన అలంకరణకు ఇప్పుడు ప్రాధాన్యతనిస్తున్నారు. పక్షుల డిజైన్ వేయించాలనుకొనే గది గోడకు లేతవర్ణం పెయింటింగ్ వేయించాలి. దానిపై ముందుగా నల్లని వర్ణంలో వరసగా ఒకదానిపై మరొకటి వచ్చేలా తీగలను గీయాలి. వాటిపై చిన్నచిన్న టోపీ పిట్టలు, పిచ్చుకలు వంటివాటిని అక్కడక్కడ వాలినట్లుగా డిజైన్ చేసి ఎరుపు, నీలం, నారింజ వర్ణాలను వాటికి నింపాలి. సహజంగా తీగలపై ఆ పిట్టలు వాలినట్లు కనిపిస్తూ, గదిని అందంగా మార్చేస్తాయి.
సహజసిద్ధంగా..
బొమ్మల దుకాణంలో లభ్యమయ్యే రంగు రంగుల పక్షుల బొమ్మలను కొన్నింటిని తీసుకోవాలి. సన్నని వెదురుతో చేసే బెడ్ ల్యాంపు లోపలివైపు సన్నని రెండు మూడు పుల్లలు అమర్చాలి. వీటిపై పక్షుల బొమ్మలను అతికించాలి. ఈ ల్యాంపు గది మధ్యలో వేలాడదీస్తే చాలు. లోపలివైపు నుంచి వర్ణభరితమైన పక్షులు కనిపిస్తూ చూడ ముచ్చటగా ఉంటాయి. అలాగే సన్నని ఇనప తీగలతో చేసే పలుచటి షీటును గుండ్రంగా ల్యాంపులా చుట్టాలి. దీనికి లోపలివైపున మధ్యలో సన్నని ఎండు పుల్లలు అమర్చాలి. బయటివైపు కృత్రిమ తీగ మొక్కను చుట్టాలి. దుకాణం నుంచి తెచ్చిన పక్షి బొమ్మలను లోపలి కర్రలకు అతికించాలి. దీన్ని ముందుగది లేదా పడకగది సీలింగ్‌కు వేలాడుతున్నట్లు ఏర్పాటు చేస్తే చాలు. నిజమైన పక్షులున్న పంజరంలా మారుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.