నీటిలో తేలియాడేలా...
ఫ్లవర్‌వాజ్‌ల్లో పూలను సర్దడం పాత పద్ధతి. అదే జార్‌లో నీటిలో మునిగి తేలేలా పూలను సర్దడం కొత్త ట్రెండ్. ఇంటికొచ్చే అతిథులను అలరించేలా పూలను రకరకాలుగా తీర్చిదిద్దొచ్చు అంటున్నారు ఇంటీరియర్ నిపుణులు.
ఫ్లవర్‌వాజ్‌ల్లో పూలను సర్దడం పాత పద్ధతి. అదే జార్‌లో నీటిలో మునిగి తేలేలా పూలను సర్దడం కొత్త ట్రెండ్. ఇంటికొచ్చే అతిథులను అలరించేలా పూలను రకరకాలుగా తీర్చిదిద్దొచ్చు అంటున్నారు ఇంటీరియర్ నిపుణులు.
* గులాబీ, తులిప్, జెర్బరా, చామంతి వంటి పూలు డైనింగ్ టేబుల్ లేదా టీపాయ్‌పై అలంకరించడానికి బాగుంటాయి. ముందుగా గదికి తగినట్లుగా పూలను ఎంపిక చేసుకోవాలి. ఎలక్ట్రానిక్ వస్తువుల ప్యాకింగ్‌లో వచ్చే బబుల్ ర్యాప్‌ను గుండ్రంగా కత్తిరించుకుని ఒక్కో పువ్వు అడుగున అతికించాలి. ఇప్పుడు ఆ పూలను సగం నీటితో నింపిన గాజు పాత్రలోకి వేస్తే సరి. అవి మునగకుండా అందంగా తేలుతూ కనిపిస్తాయి. ఎక్కువ సమయం తాజాగానూ ఉంటాయి.
* పొడవాటి గ్లాసుల్లా ఉండే రెండు మూడు జార్స్‌ను ఎంపిక చేసుకోవాలి. విరిసీ విరియని మొగ్గల్లా ఒకేలా ఉండే లేత రంగు గులాబీలను తీసుకోవాలి. వీటి కాడలు పొడవుగా ఉండేలా కట్ చేయాలి. జార్స్‌లో సగంపైగా నీటిని నింపి అడుగున గోళీలను రెండు వరుసలొచ్చేలా వేయాలి. వీటి మధ్యలో గులాబీలనుంచాలి. నీటిలో మునిగి, తేలియాడుతూ.. గులాబీలు చూడచక్కగా ఉంటాయి.
* నాలుగైదు రంగుల తులిప్ పూలను ఎంచుకోవాలి. చిన్న వెడల్పాటి గ్లాసు లేదా గుండ్రని వెడల్పాటి జార్‌లను తీసుకొని అందులో సగం నీటిని నింపాలి. వీటిలో మునిగేలా పూల కాడను కట్ చేయాలి. వీటిని నీటిలో ఉంచగానే గ్లాసు లోపలే కనిపిస్తూ రంగురంగుల పూలు గదికే అందాన్ని తెస్తాయి. ఈ రకమైన పూల అలంకరణతో ఇంటిని మరింత అందంగా మార్చుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.