ఇవి ఫ్రిజ్‌లో పెడుతున్నారా...

కనిపించిన ప్రతి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టేయడం మనలో చాలామందికి అలవాటు. కానీ, కొన్ని పదార్థాలను ఇలా పెట్టడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువట.

Published : 07 Jun 2023 00:05 IST

కనిపించిన ప్రతి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టేయడం మనలో చాలామందికి అలవాటు. కానీ, కొన్ని పదార్థాలను ఇలా పెట్టడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువట.

బ్రెడ్‌: దీన్ని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల త్వరగా తేమను కోల్పోయి ముందుగానే పాడవుతుంది. దీన్ని పొడిగా, చల్లగా ఉండే ప్రదేశంలో ఉంచితే సరిపోతుంది. లేదంటే బ్రెడ్‌ బ్యాగుల్లో భద్రపరచొచ్చు. 

అరటిపండ్లు:  వీటిని ఫ్రిజ్‌లో పెట్టడం కంటే...గాలి తగిలేలా వేలాడదీస్తే సరి. లోపలి చల్లదనంతో కాయ నల్లగా మారిపోయి....క్రమంగా తినడానికి పనికి రాకుండా పోతాయి. మరీ పండిపోతే మాత్రం కొద్దిసేపు లోపల ఉంచితే మిగలముగ్గిపోకుండా ఉంటాయి.

తేనె: ఈ సీసాను ఫ్రిజ్‌లో ఉంచితే గనుక గట్టిగా మారిపోతుంది. వాడుకోవడానికి ఎంత మాత్రం అనువుగా ఉండదు. తడిలేని గాజుపాత్రలో ఉంచితే పాడవ్వకుండా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని