పడకగది విశాలం.. మనసు ఆహ్లాదం

మనకు ఇంటి అలంకరణపై ప్రత్యేక అభిరుచి ఉంటుంది. అందుకే, దీన్ని తమ వ్యక్తిత్వాన్నీ, ఇష్టాల్నీ ప్రతిబింబించేలా తీర్చిదిద్దాలని భావిస్తాం.

Published : 08 Jun 2023 00:11 IST

మనకు ఇంటి అలంకరణపై ప్రత్యేక అభిరుచి ఉంటుంది. అందుకే, దీన్ని తమ వ్యక్తిత్వాన్నీ, ఇష్టాల్నీ ప్రతిబింబించేలా తీర్చిదిద్దాలని భావిస్తాం. ఈ క్రమంలో పడకగదిని విశాలంగా, ఆహ్లాదంగా మార్చేందుకు ఈ చిట్కాలు మీకు తోడ్పడతాయి.

* పడకగది సౌకర్యవంతంగానే కాకుండా అడుగుపెట్టిన వారు రిఫ్రెష్‌ అయిన భావన కలగాలంటే గదంతా సహజకాంతి పడుతున్నట్లు అనిపించాలి. పడకగది గోడలకు తెలుపు రంగు వేయించండి. ఫ్లోర్‌ టైల్స్‌ కూడా పాలవర్ణంలో మెరిస్తే... గదంతా కాంతిమంతంగా కనిపిస్తూ మనసునీ ఆహ్లాదపరుస్తుంది.

* గది మూలల్లో 2, 3 ఇండోర్‌ ప్లాంట్స్‌, ఓ పక్కగా ఉండే స్టాండు లేదా అలమరలో  ప్రాచీన కాలం నాటి క్లాసిక్‌ డెకరేటివ్‌ పీస్‌లు ఏవైనా సర్దాలి. గోడ వర్ణానికి భిన్నమైన రంగులో కిటికీ, గుమ్మం కర్టెన్లు, లేత వర్ణం దుప్పట్లను ఎంపిక చేసుకుంటే లుక్‌ అదిరిపోతుంది.

* ఎంత తక్కువ అలంకరణ ఉంటే గది అంత విశాలంగా అనిపిస్తుంది. గోడలను లేత ఊదా, గులాబీ వంటి వర్ణంతో నింపి పడకగదిని పెద్దగా కనిపించేలా చేయొచ్చు.  గదిలో పెట్టే చిన్న టేబుల్‌, దానిపై సర్దే పూల కూజా, నైట్‌ల్యాంపు, దుప్పట్లు, కిటికీ కర్టెన్లు, దిండ్లు అన్నీ లేత ఛాయల్లో ఉంటే చాలు విశాలంగా కనిపిస్తుంది.

* ముఖ్యమైన సామాను ఉంచడానికి అలమర అవసరం తప్పనిసరి అనిపిస్తే దానికి ఎక్కువ స్థలం అవసరం అవుతుంది. అందువల్ల మిగతా ఫర్నిచర్‌ ఫోల్డ్‌ అయ్యేవి తీసుకుంటే గది ఇరుకుగా ఉన్నట్లు అనిపించదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్