చిట్టి చిట్టి తోటలు..

మొక్కల పెంపకం అందరికీ ఇష్టమే. అయితే, స్థలాభావం వల్ల చాలా మందికి కుదరకపోవచ్చు. ఇలాంటప్పుడు ఒకే జాతికి చెందిన మొక్కల్ని పెంచుకోవడానికి ఈ సారి గార్డెన్‌ బెడ్స్‌ ప్రయత్నించండి.

Published : 12 Jun 2023 00:21 IST

మొక్కల పెంపకం అందరికీ ఇష్టమే. అయితే, స్థలాభావం వల్ల చాలా మందికి కుదరకపోవచ్చు. ఇలాంటప్పుడు ఒకే జాతికి చెందిన మొక్కల్ని పెంచుకోవడానికి ఈ సారి గార్డెన్‌ బెడ్స్‌ ప్రయత్నించండి. కార్డ్‌ బోర్డు, టైర్లు, ఇటుకలు, రాళ్లు, ప్లాస్టిక్‌ వంటి వృథా వస్తువులతోనే వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు.. 

తోటలో పెరిగే మొక్కలకన్నా ఒకటి రెండు అడుగుల ఎత్తులో మొక్క ఉన్నట్లు ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుందీ గార్డెన్‌ బెడ్‌. ఇటుకలు, రాళ్లు లేదా పాత చెక్కలను పేర్చి కావాల్సిన ఆకారంలో చక్కని ఫ్రేమ్‌గా ఈ బెడ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందులో సేంద్రియ ఎరువులు కలిపిన మట్టి నింపి ఆపై ఆకు కూరల విత్తనాలు వేసి పెంచాలి. రెండు వారాల్లోపే రకరకాల ఆకుకూర మొలకలు ఒక చోట చూడముచ్చటగా పెరుగుతాయి. తోటకూర, పుదీనా, కొత్తిమీరను ఇలా విడివిడిగా ఒక్కొక్క బెడ్‌లో పెంచితే కట్‌ చేయడానికి వీలుగా ఉంటుంది. బాల్కనీలోనూ పెద్దపెద్ద బ్యాగులు లేదా వృథా చెక్క బాక్సుల నిండా మట్టి నింపితే చాలు. గార్డెన్‌ బెడ్‌ సిద్ధమవుతుంది. వీటిలో ఆకుకూరలు లేదా హెర్బ్స్‌ను పెంచొచ్చు. 

వర్ణ రంజితంగా... తోటలో కాస్తంత చోటుంటే మనసుకు నచ్చిన రకరకాల పూలమొక్కలన్నీ ఒకేచోట పెంచుతాం. అలాకాకుండా ఇటుకలు, రాళ్లతో గార్డెన్‌ బెడ్‌ను తయారుచేసి అందులో గులాబీ రకాలన్నీ నాటాలి. దానికి కొంచెం పక్కగా మందార,  చామంతి, బంతి వంటి మొక్కలకు విడివిడిగా బెడ్స్‌ సిద్ధం చేసుకోవచ్చు. ఇలా వివిధ జాతుల పూల మొక్కలు వరుసగా విరగబూస్తే ఎంత బాగుంటుందో కదా!

పాత ఫర్నిచర్‌లోనూ.. ఏళ్లనాటి టీపాయి మధ్య భాగంలో పాడైందని వదిలేస్తాం. పాత డెస్కులు వదులయ్యాయని మూల పడేస్తాం. ఈ వృథా వస్తువులను కాస్త సరిచేసి, ముదురు రంగు పెయింట్‌ వేసి ఆరనివ్వాలి. వీటిల్లో నచ్చిన పూల మొక్కల రకాలన్నీ నాటినా చాలు. వీటిని బాల్కనీలోనో వరండాలోనే పెడితే ఆ ప్రదేశానికే కళ వస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని