రిఫ్రిజిరేటర్‌ శుభ్రమిలా..

ఈ వేడిని భరించడానికి మనకు గుర్తొచ్చేది చల్లని పదార్థాలు.. వాటిని ఉంచే రిఫ్రిజిరేటరే కదూ! కానీ దాన్ని శుభ్రం చేయడమే పెద్ద పనిలా తోస్తుంది. ఈ చిట్కాలను పాటించండి. పని తేలిక అవుతుంది...

Updated : 22 Jun 2023 12:50 IST

ఈ వేడిని భరించడానికి మనకు గుర్తొచ్చేది చల్లని పదార్థాలు.. వాటిని ఉంచే రిఫ్రిజిరేటరే కదూ! కానీ దాన్ని శుభ్రం చేయడమే పెద్ద పనిలా తోస్తుంది. ఈ చిట్కాలను పాటించండి. పని తేలిక అవుతుంది...

వంటసోడా... ట్రేలు, అరలు అన్ని తొలగించాక కప్పు నీటిలో చెంచాడు వంటసోడాను కలపండి. మరకల్ని శుభ్రం చేయడానికి ఇది ఉపయోగ పడుతుంది. చిన్న బ్రష్‌ను ఉపయోగిస్తే మూలలూ సులభంగా శుభ్రం చేసేయొచ్చు. లేదా వేడినీళ్లలో టిష్యూలను ఉంచి వాటిని మరకలు, ఫుడ్‌ కలర్స్‌ అంటుకున్న చోట అతికిస్తే అవి సులభంగా తొలగిపోతాయి. ట్రేలు, అరలు శుభ్రం చేసేటప్పుడూ ఇలానే చేస్తే సరి.

వెనిలా ఎసెన్స్‌... ఆహారం నిల్వ ఉండటం వల్ల వచ్చే వాసనలు పోవాలంటే వెనిలా ఎసెన్స్‌లో దూది ఉండల్ని ముంచి ఫ్రిజ్‌ అరల మూలల్లో  ఉంచండి. ఎలాంటి దుర్వాసనలైనా పోతాయి. వేడి నీళ్లలో కాస్త బ్లీచ్‌ వేసి తుడిచినా రిఫ్రిజిరేటర్‌ను తేలికగా శుభ్రం అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని