సహజ పరిమళాలివి..
ఈ కాలంలో చెమటకు తడిచిన దుస్తులు, మేజోళ్ల వాసనలు ఇబ్బంది పెడుతుంటాయి. వాటిని తొలగించడానికి మార్కెట్లో దొరికే రసాయన ఫ్రెషనర్లను వాడుతుంటాం. బోలెడంత ఖర్చేకాదు, గాఢత ఎక్కువై అనారోగ్యాలనూ తెచ్చిపెడతాయి.
ఈ కాలంలో చెమటకు తడిచిన దుస్తులు, మేజోళ్ల వాసనలు ఇబ్బంది పెడుతుంటాయి. వాటిని తొలగించడానికి మార్కెట్లో దొరికే రసాయన ఫ్రెషనర్లను వాడుతుంటాం. బోలెడంత ఖర్చేకాదు, గాఢత ఎక్కువై అనారోగ్యాలనూ తెచ్చిపెడతాయి. వంటింట్లో దొరికే కొన్ని వస్తువులతో ఇంట్లోనే ఎయిర్ ఫ్రెషనర్లను తయారు చేసుకోండిలా..
కర్పూరం... నాలుగైదు కర్పూరాలను తీసుకుని మెత్తగా పొడి చేసి సీసాలో వేసి.. దానిలో నాలుగైదు చుక్కల గులాబీనీరు వేసి గిలక్కొట్టండి. దీనికి కాస్త నీళ్లు కలిపి వాసనలు వచ్చే చోట స్ప్రే చేస్తే చాలు. ఇల్లు తాజా సువాసనలతో నిండిపోతుంది.
అరోమా థెరపీ... యాంటీ బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్ గుణాలు ఉండే యూకలిప్టస్, నిమ్మ, లావెండర్ నూనెలను తీసుకోండి. మరిగించిన నీటిలో రెండు మూడు చుక్కల నూనెను వేయండి. దాని నుంచే వచ్చే సువాసనలకు గదంతా పరిమళిస్తుంది.
కాఫీ... చెడు వాసనలను ఎదుర్కోవ డానికి కాఫీ మంచి ఆయుధం. కాఫీపొడిని అవెన్‌లో వేడిచేయండి. తర్వాత అవెన్ తలుపు తెరిచి ఉంచితే సరి. ఉల్లి, వెల్లుల్లి, చెత్త దుర్వాసనలు పోతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.