ఇంటిని అలంకరిద్దామిలా

సిరామిక్‌తో తయారు చేసే వస్తువుల్ని ఇష్టపడని వారుండరు. విరిగిపోతాయనో, పిల్లలు కుదురుగా ఉండనివ్వరనో వాటిని ఇంట్లో పెట్టుకోడానికి అంతగా ఆసక్తి చూపించం.

Published : 28 Jun 2023 00:41 IST

సిరామిక్‌తో తయారు చేసే వస్తువుల్ని ఇష్టపడని వారుండరు. విరిగిపోతాయనో, పిల్లలు కుదురుగా ఉండనివ్వరనో వాటిని ఇంట్లో పెట్టుకోడానికి అంతగా ఆసక్తి చూపించం. అన్నిచోట్ల కాకపోయినా కొన్ని అనువైన స్థలాల్లోనైనా వీటిని పెడితే అందం, ఆహ్లాదం..

డైనింగ్‌ ప్రాంతం... భోజనాల బల్ల మీద గిన్నెలు, ప్లేట్లు, కొవ్వొత్తులు పెట్టే స్టాండ్లకు వీటిని ప్రయత్నించండి. తినేటప్పుడు ఎలానూ పిల్లలు మన పర్యవేక్షణలోనే ఉంటారు కాబట్టి పాత్రలు విరుగుతాయన్న భయం ఉండదు. ప్లాస్టిక్‌ వినియోగాన్నీ తగ్గించిన వారమవుతాం.

గోడల్ని... సిరామిక్‌ వాల్‌ డిజైన్స్‌ మార్కెట్లో చాలానే అందుబాటులోకి వచ్చాయి. ఇంటి అందాన్ని అవి మరింత పెంచుతాయి. చేయాల్సిందల్లా ఒక్కటే తగిన స్టాండ్‌ను ఏర్పాటు చేయాలి. మంచి బౌల్స్‌, కుండీలను తెచ్చుకుని వాటిలో పువ్వులు వేసి ఫ్లవర్‌వాజ్‌లుగా అలంకరిస్తే సరి.

మొక్కలకు... ఇంటి ముందు మొక్కలను అలంకరణగా పెట్టుకోవడానికి ఇప్పుడు చాలా మంది ఇష్టపడుతున్నారు. మట్టి, ప్లాస్టిక్‌ కుండీల్లో కాకుండా ఒక్కసారి సిరామిక్‌ను ప్రయత్నించి చూడండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని