తోట మట్టిలో పోషకాలుండేలా..

మట్టి బలంగా ఉంటేనే మొక్కలకు కావాల్సిన పోషకాలు అంది ఆరోగ్యంగా పెరుగుతాయి. అలాగని రసాయనిక ఎరువులను వాడొద్దు.  ఇవి క్రమేపీ మట్టిని బలహీనపరుస్తాయి. పోషకాలు తగ్గి, మట్టి సహజత్వాన్ని కోల్పోతుంది. అలాకాకుండా వ్యర్థాలతోనే మట్టిని పోషకాలమయంగా మార్చుకోవచ్చు.

Published : 29 Jun 2023 00:25 IST

ట్టి బలంగా ఉంటేనే మొక్కలకు కావాల్సిన పోషకాలు అంది ఆరోగ్యంగా పెరుగుతాయి. అలాగని రసాయనిక ఎరువులను వాడొద్దు.  ఇవి క్రమేపీ మట్టిని బలహీనపరుస్తాయి. పోషకాలు తగ్గి, మట్టి సహజత్వాన్ని కోల్పోతుంది. అలాకాకుండా వ్యర్థాలతోనే మట్టిని పోషకాలమయంగా మార్చుకోవచ్చు.

ఎరువు తయారీకి.. ఇంటి వ్యర్థాలతో సేంద్రియ ఎరువులను తయారు చేసుకోవచ్చు. ఇది మట్టిని పోషకాలమయం చేస్తుంది. మొక్క ఎదుగుదలకు అవసరమయ్యే సూక్ష్మజీవులను అందిస్తుంది. ఓ గొయ్యి తీసి వంటింటి వ్యర్థాలను నింపి ఆకులు, గడ్డితో కప్పాలి.  మార్కెట్లో దొరుకుతున్న కంపోస్ట్‌ బాక్సుని కూడా దీనికి వినియోగించొచ్చు.

వ్యర్థాలతో... పాతచెక్క, కార్డ్‌బోర్డు ముక్కలు, రాలిన ఆకులు, కొమ్మలు, కాగితాలను కలిపి కంపోస్ట్‌ చేయొచ్చు. వంటింటి వ్యర్థాలైన పండ్లు, కూరగాయల తొక్కలు, వడలిన పూలు, కుళ్లిన కాడలు, గడ్డి వంటివన్నీ ఎరువు తయారీకి పనికొస్తాయి. ఇందులో వ్యర్థ ఆహారపదార్థాలు, చీడపట్టిన కొమ్మలు వంటివి మాత్రం కలపకూడదు. గోతిలో వేసిన ఈ చెత్తపై కొంత మట్టి కప్పి ఐదారు నెలలపాటు మూసేయాలి. పొడిపొడిగా మారే ఈ మట్టిలో మొక్కలకు కావాల్సిన పోషకాలుంటాయి. 

పెరటి ఎరువు.. కూరగాయల మొక్కల కోసం ప్రత్యేకంగా పెరటి ఎరువును తయారు చేసుకోవచ్చు. పేడ, కోడి మాంసం, చేపల వ్యర్థాలు, రంపపు పొట్టు, కోడి పెంటను గోతిలో నింపి నీళ్లు చల్లి కప్పి ఉంచాలి. నాలుగైదు వారాల తర్వాత ఇది ఎరువుగా మారుతుంది. దీన్ని మొక్కలు నాటేటప్పుడు వాటి మొదళ్లలో వేస్తే ఇందులోని ఫాస్పరస్‌ ఆరోగ్యంగా ఎదగడానికి తోడ్పడుతుంది. చామంతి, బంతి మొక్కలు సీజన్‌ తర్వాత వడలిపోతుంటాయి. అటువంటి మొక్కలను తొట్టె నుంచి తీసేసి ఆ మట్టిని పెరట్లో మొక్కల చుట్టూ లేదా ప్లాంట్‌ బెడ్స్‌కు సరిహద్దులా సర్దినా చాలు. పోషకాలు అందుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని