సహజంగా వదిలించేద్దాం!
పిల్లలకు స్కూళ్లు మొదలయ్యాయి. ఉదయాన్నే మల్లెపూవులా పంపిస్తామా.. సాయంత్రానికి మరకలతో వచ్చేస్తారు. వాటిని వదలగొట్టేసరికి మనకి నీరసం వస్తుంది. రసాయన ఉత్పత్తులు పిల్లలకు అలర్జీలకు కారణమవుతాయేమోనన్న భయం. ఈ సహజ చిట్కాలు ప్రయత్నించండి.
పిల్లలకు స్కూళ్లు మొదలయ్యాయి. ఉదయాన్నే మల్లెపూవులా పంపిస్తామా.. సాయంత్రానికి మరకలతో వచ్చేస్తారు. వాటిని వదలగొట్టేసరికి మనకి నీరసం వస్తుంది. రసాయన ఉత్పత్తులు పిల్లలకు అలర్జీలకు కారణమవుతాయేమోనన్న భయం. ఈ సహజ చిట్కాలు ప్రయత్నించండి.
⚛ బేకింగ్ సోడా.. పాఠశాలంటే చదువే కాదు.. ఆటలు కూడా! చెమటలు కక్కుకుంటూ వస్తారు కదా! దుమ్ముతో కలిసి దుస్తులు ఒకలాంటి వాసన వస్తాయి. వాటిని కొద్దిసేపు బేకింగ్ సోడా వేసిన నీటిలో నానబెట్టి ఉతకండి.. వాసనతోపాటు దుమ్మూ వదులుతుంది.
⚛ నిమ్మ.. చెమట కారణంగా తెల్ల షర్టుల చేతుల కింద పసుపు వర్ణంలోకి మారతాయి. బస్సు, స్కూల్లో గ్రిల్స్ తుప్పు మరకల ప్రమాదం కూడా! ఈ రెంటికీ నిమ్మతో చెక్ పెట్టేయొచ్చు. దుస్తులు నానబెట్టే నీటిలో నిమ్మరసం పిండండి. కాసేపయ్యాక రుద్ది, జాడించేస్తే చాలు.
⚛ డిస్టిల్డ్ వైట్ వెనిగర్.. దుస్తులు మెరవాలి, మెత్తగా, మృదువుగా ఉండాలని ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్లను వాడుతుంటాం కదా! బదులుగా జాడించే నీటిలో ఈ వెనిగర్‌ని కలపండి చాలు.
⚛ పౌడర్.. కూర, నూనె మీద పడేసుకున్నారా? ఆ మరకల మీద పౌడర్ లేదా మొక్కజొన్న పొడి చల్లి కొద్దిసేపు వదిలేయండి. తర్వాత సబ్బుతో ఉతికితే తేలిగ్గా వదులుతాయి.
⚛ పాలు.. స్కూలన్నాక ఇంకు మరకలు సరేసరి. ఒక పాత్రలో తగినన్ని పాలు తీసుకొని మరక వరకూ మునిగేలా ఉంచండి. కొన్ని గంటలు అలా వదిలేసి, తర్వాత ఉతికేస్తే సరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.