గాలి తగిలేలా..

తాజా పండ్లను తీసుకొచ్చి భోజనాల బల్లపై ఉంచుతాం. అవేమో రెండు రోజులకే అడుగువి మెత్తబడుతుంటాయి. దుంపలు, ఉల్లి వంటివి ఒకే ట్రేలో సర్దితే కుళ్లిపోతుంటాయి. ఇలా కాకూడదంటే గతంలోని ఉట్టి విధానం సరైనదంటున్నారు ఇంటీరియర్‌ నిపుణులు. అరటిపండ్లను ఫ్రిజ్‌లో ఉంచడానికి వీలుండదు. అలాగని వేరే పండ్లతో కలిపి ఉంచితే త్వరగా పాడవుతాయి.

Published : 30 Jun 2023 00:25 IST
తాజా పండ్లను తీసుకొచ్చి భోజనాల బల్లపై ఉంచుతాం. అవేమో రెండు రోజులకే అడుగువి మెత్తబడుతుంటాయి. దుంపలు, ఉల్లి వంటివి ఒకే ట్రేలో సర్దితే కుళ్లిపోతుంటాయి. ఇలా కాకూడదంటే గతంలోని ఉట్టి విధానం సరైనదంటున్నారు ఇంటీరియర్‌ నిపుణులు.  
రటిపండ్లను ఫ్రిజ్‌లో ఉంచడానికి వీలుండదు. అలాగని వేరే పండ్లతో కలిపి ఉంచితే త్వరగా పాడవుతాయి. వీటి కోసం ప్రత్యేకంగా హ్యాంగింగ్‌ రోప్స్‌ మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. అలమరలకు పక్కగా గోడలకు ఏర్పాటు చేయడానికి హుక్కులు కూడా జతగా వస్తున్నాయి. అలా తగిలించిన రోప్స్‌కు అరటిపండ్ల హస్తాన్ని వేలాడదీస్తే చాలు. త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులుండే అవకాశం ఉంటుంది. అలాగే యాపిల్‌, నారింజ వంటివాటిని ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు ఎక్కువ చల్లదనానికి కొన్నిసార్లు మెత్తబడుతుంటాయి. కొన్నిసార్లు ఫ్రిజ్‌లో ఉంచి మర్చిపోతుంటాం. అటువంటప్పుడు పండ్లన్నీ వృథా అవుతాయి. అలాకాకుండా కంటికి ఎదురుగా కనిపిస్తే తాజాగా ఉన్నాయా లేదా ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవచ్చు. వీటికోసం ప్రస్తుతం మార్కెట్లో ఊయల్లా అనిపించేలా ఊలుతో చేసిన క్రోషెట్స్‌ వస్తున్నాయి. వీటికి రెండు వైపులా ఉన్న రింగులను గోడకున్న మేకులకు తగిలిస్తే చాలు. పండ్లను సర్దడానికి వీలుగా ఉంటుంది. ఇందులో ప్రతి పండుకు గాలి తగులుతూ ఉంటుంది. దీంతో ఎక్కువరోజులు తాజాగా ఉంటాయి.
కూరగాయలను.. ఉల్లిపాయలు, టొమాటో, బంగాళదుంప, కంద వంటివాటిని ట్రేలో ఒకదానిపై మరొకదాన్ని ఉంచినా త్వరగా మెత్తబడతాయి. చినుకులు పడుతున్న ఈ సమయంలో ఉల్లిపాయలు త్వరగా పాడయ్యే ప్రమాదమూ లేకపోలేదు. ఇటువంటివాటిని గాలి తగిలేలా భద్రపరచే క్రోషెట్స్‌ వస్తున్నాయి. బాస్కెట్‌, లేదా సీసా ఆకారంలో వస్తున్న వీటిలో విడివిడిగా దుంపలను సర్ది వంటింట్లో వేలాడదీస్తే చాలు. ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. అంతేకాదు, ఈ క్రోషెట్స్‌ ఎకో ఫ్రెండ్లీగా అనిపిస్తూ వంటింటి అలంకరణలోనూ భాగమవుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని