తోటల్ని రక్షించుకోండిలా
చిన్నా, పెద్ద అందరూ ఇప్పుడు గార్డెనింగ్‌ని వ్యాపకంగా మలచుకుంటున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇదో మంచి ఉపశమనం అని నిపుణులూ చెబుతున్నారు.
చిన్నా, పెద్ద అందరూ ఇప్పుడు గార్డెనింగ్‌ని వ్యాపకంగా మలచుకుంటున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇదో మంచి ఉపశమనం అని నిపుణులూ చెబుతున్నారు. మరి ఇష్టంగా, ఆసక్తిగా పెంచుకునే తోట పురుగులు, తెగుళ్లతో పాడైతే? మనసొప్పదు కదూ. అందుకే ఈ చిట్కాలు...
⚛ గాఢత తక్కువగా ఉన్న లిక్విడ్ సోప్ రెండు చెంచాలు గ్లాసు నీటిలో కలపండి. ఆ ద్రావణాన్ని మొక్కలపై పిచికారీ చేయండి. దీనివల్ల తెల్లదోమ, పేను బంక వంటి కీటకాలు తొలగిపోతాయి.
⚛ వెల్లుల్లి, ఉల్లి ద్రావణం మొక్కలకు వచ్చే చీడపీడలను తొలగించడానికి ప్రభావవంతంగా పని చేస్తుంది. చిన్న ఉల్లిపాయలు రెండు, వెల్లుల్లి రెబ్బలు నాలుగు, రెండు లవంగాలు మెత్తగా రుబ్బండి. దానిలో గ్లాసుడు నీళ్లు పోసి వడకట్టండి. రాత్రంతా నిల్వ ఉంచి మొక్కలపై చల్లితే సరి.
⚛ మిరియాల ద్రావణమూ మొక్కలకు సహజ క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది. దీన్ని సిద్ధం చేయడానికి గ్లాసు నీళ్లలో రెండు చెంచాల మిరియాల పొడిని కలపండి. తక్కువ సెగ మీద మరిగించండి. రాత్రంతా నిల్వ ఉంచి తెగుళ్లు ఉన్నచోట చల్లితే సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.