డిజైన్లు వత్తేయండి!

రుచితో కాదు.. పిల్లలను ముందు ఆకర్షణతో ఆకట్టుకోవాలి. కళ్లకు నచ్చితే కానీ దేన్నైనా వాళ్ల నోట్లోకి పంపడం సాధ్యం కాదు మరి.

Published : 09 Jul 2023 00:51 IST

రుచితో కాదు.. పిల్లలను ముందు ఆకర్షణతో ఆకట్టుకోవాలి. కళ్లకు నచ్చితే కానీ దేన్నైనా వాళ్ల నోట్లోకి పంపడం సాధ్యం కాదు మరి. ఇక స్నాక్స్‌ సంగతి సరే సరి. రోజుకో రకం కావాలంటారు. బయట తెచ్చేవేమో చేటు చేస్తాయేమోననే భయం. ఎలా అని ఆలోచిస్తున్నారా? ఈ రోలింగ్‌ పిన్‌ తెచ్చేసుకోండి. చపాతీ, బిస్కెట్లు.. ఏవి చేయాలనుకున్నా పిండిని దీనితో వత్తేస్తే సరి! డిజైన్లు, బొమ్మల అచ్చులు పడతాయి. అంతే.. పిల్లల ముందు ఉంచితే లొట్టలేసుకుంటూ తినడం ఖాయం. ప్రయత్నించాలనుందా.. దీనికోసం ఆన్‌లైన్‌లో వెతికేయండి మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని