వర్షాకాలంలో జరభద్రం

వర్షాన్ని ఇష్టపడని వారుండరు. కానీ అందం, అలంకరణ, అభిరుచి.. ఇలా బోలెడు కారణాలతో మనం పెంచుకుంటున్న మొక్కలకు మాత్రం కొంచెం కఠిన కాలమిది. జాగ్రత్తగా చూసుకోవాలిగా మరి?

Published : 09 Jul 2023 01:02 IST

వర్షాన్ని ఇష్టపడని వారుండరు. కానీ అందం, అలంకరణ, అభిరుచి.. ఇలా బోలెడు కారణాలతో మనం పెంచుకుంటున్న మొక్కలకు మాత్రం కొంచెం కఠిన కాలమిది. జాగ్రత్తగా చూసుకోవాలిగా మరి?

సరైన డ్రైనేజీ.. ఈ కాలంలో నీరు నిల్వ ఉండి మొక్కల పెరుగుదలకు ఆటకం కలుగుతుంది. నీటి ఎద్దడి ఎక్కువై వేర్లకు శ్వాసతీసుకోవడం కష్టమై మొక్క చనిపోతుంది. నీళ్లు నిల్వ ఉండటం వల్ల కుళ్లిపోతుంది. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే మొక్కలు ఉన్న ప్రాంతంలో సరైన డ్రైనేజీని ఏర్పాటు చేయాలి. కుండీల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలి.

రో కవర్ల వినియోగం.. ఆకుకూరలు, కూరగాయలు, పువ్వులూ పండించేవారు రో కవర్లను వాడటం వల్ల మొక్కలు చనిపోకుండా ఉంటాయి. ఇవి ఎలాంటి పరిస్థితుల్లో అయినా తోటను రక్షిస్తాయి. ఈ కవర్లు పారదర్శకంగా ఉండటం వల్ల  అవసరమైన మేర సూర్యరశ్మిని అందిస్తూ, తేమకు దూరంగా ఉంచుతాయి.

మట్టిని తనిఖీ చేస్తున్నారా... వర్షాలకు మట్టిలోని ఆరోగ్యకరమైన పొర కొట్టుకుపోవడం సహజమే. అందుకే మట్టిని తనిఖీ చేస్తుండాలి. వేరు, మూల భాగాలు గట్టిపడి పోషణకు ఆటంకం కలగకుండా గాలి చేరేలా మట్టిని వదులు చేస్తూ ఉండాలి. దీనివల్ల నీటి నిల్వను అడ్డుకోవచ్చు.   

కీటకాల నుంచి దూరంగా... వర్షాకాలంలో క్రిమికీటకాలు పెరిగే అవకాశాలు ఎక్కువ. వాటినుంచి మొక్కలను కాపాడుకోవాలంటే పాదుల చుట్టూ వేపాకు, లవంగాల పొడి చల్లండి. ఇవి మొక్కల పోషణకు ఆటంకం కలిగించే కీటకాలకు అడ్డుకట్ట వేయొచ్చు.

పాదులకు దన్నుగా... బలమైన గాలులు, వర్ష తాకిడికి సన్నగా, పొడవుగా పెరిగే మొక్కలు విరిగిపోతుంటాయి. అలా కాకుండా వాటికి మందపాటి కర్రలను దన్నుగా వాడండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని