కదిలించడం.. తేలికే!

ప్రతిరోజూ ఇల్లంతా శుభ్రపరుస్తాం. అయినా సోఫాలు, మంచాలు, బరువైన వాటి వెనుక, మూలల్లో మాత్రం ఎంత జాగ్రత్తపడ్డా దుమ్ము పేరుకొంటుంది. వాటి కింద శుభ్రం చేయడమేమో కష్టమైన పని.

Published : 11 Jul 2023 00:06 IST

ప్రతిరోజూ ఇల్లంతా శుభ్రపరుస్తాం. అయినా సోఫాలు, మంచాలు, బరువైన వాటి వెనుక, మూలల్లో మాత్రం ఎంత జాగ్రత్తపడ్డా దుమ్ము పేరుకొంటుంది. వాటి కింద శుభ్రం చేయడమేమో కష్టమైన పని. జరపడానికీ ఎవరో ఒకరి సాయం కావాలి. ఇదంతా పెద్ద తలనొప్పని చాలాసార్లు వదిలేస్తాం. కానీ అనారోగ్యం కదా! అందుకే.. ఈ ఫర్నిచర్‌ టూల్‌కిట్‌ని తెచ్చేసుకోండి. వీటిలోని లిఫ్టింగ్‌ పరికం సాయంతో ఎంత పెద్ద వస్తువునైనా తేలికగా పైకి లేపొచ్చు. అంతేకాదు చక్రాలను అమర్చుకొని పక్కకు జరుపుకోవడమూ సులువే. ఎవరి సాయం లేకుండానే శుభ్రం చేసుకునే ఇవి మీకూ కావాలి అనిపిస్తున్నాయా? ఇంకేం ఆన్‌లైన్‌లో వెతికేయండి మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని