ఉల్లి వాసన వదలడం లేదా?

ఉల్లి, వెల్లుల్లి వంటివాటిని తరిగినప్పుడు చేతులు ఘాటు వాసన వస్తుంటాయి. ఎంత శుభ్రం చేసుకున్నా ఆ వాసన వదలదు. అలా రాకుండా చేయాలంటే కొన్ని చిట్కాలు చూద్దాం..

Published : 12 Jul 2023 00:03 IST

ఉల్లి, వెల్లుల్లి వంటివాటిని తరిగినప్పుడు చేతులు ఘాటు వాసన వస్తుంటాయి. ఎంత శుభ్రం చేసుకున్నా ఆ వాసన వదలదు. అలా రాకుండా చేయాలంటే కొన్ని చిట్కాలు చూద్దాం..

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండి దానిలో కాసేపు చేతులు ఉంచితే వాసనను దూరమవుతుంది.

చెంచా బేకింగ్‌ సోడా, అర చెంచా ఉప్పు తీసుకుని అందులో కాస్త నీరు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దానిని వేళ్లకు రెండు నిమిషాలు రుద్దుకుని చేతులు కడిగేసుకుంటే వాసన దూరం అవుతుంది.

 అరచేతులపై కాఫీ పౌడర్‌ను కొద్దిగా చల్లుకోవాలి. కొంచెం తడి చేసి చేతులను స్క్రబ్‌ చేసుకుని నీటితో శుభ్రం చేస్తే సరి. వాసన రాకుండా ఉంటుంది.

 చేతులపై రెండు చుక్కల వెనిగర్‌ వేసి రాసుకోవాలి. వెనిగర్‌ వాసన వచ్చినా అది కాసేపటి తర్వాత తగ్గిపోతుంది.

 నిమ్మరసం చేతిపై పిండుకొని బాగా స్క్రబ్‌ చేసుకోవాలి. రెండు నిమిషాలు ఆగి కడిగేసుకుంటే ఉల్లి, వెల్లుల్లి వాసనలు రాకుండా ఉంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని