వంటింటి యాంటీబయాటిక్స్ తెలుసా!
ఏ చిన్న ఇన్‌ఫెక్షన్ వచ్చినా వైద్యులు రాసే మందుల్లో యాంటీబయాటిక్స్ ముందుంటాయి. ఇవి శరీరానికి ఎంత ఉపశమనం కలిగిస్తాయో వినియోగం తర్వాత అంతే ఎక్కువ సమస్యలను తెచ్చిపెడతాయి.
ఏ చిన్న ఇన్‌ఫెక్షన్ వచ్చినా వైద్యులు రాసే మందుల్లో యాంటీబయాటిక్స్ ముందుంటాయి. ఇవి శరీరానికి ఎంత ఉపశమనం కలిగిస్తాయో వినియోగం తర్వాత అంతే ఎక్కువ సమస్యలను తెచ్చిపెడతాయి. శారీరకంగా బలహీనంగా ఉండే మహిళలకు వీటి దుష్ప్రభావాలు మరింత ఎక్కువగా ఉంటాయి. వీటికి ప్రత్యామ్నాయంగా వంటింట్లో దొరికే ఈ యాంటీబయాటిక్స్ గురించి తెలుసుకుందామా..
వెల్లుల్లి : మనం తినే ఆహారంలో వ్యాధికారకాలుంటాయి. వాటిని తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే శక్తిమంతమైన సహజ యాంటీబయాటిక్స్ అనేక రకాల బాక్ట్టీరియాలకు వ్యతిరేకంగా పోరాడతాయి.
పసుపు : దీనిలో ఉండే కర్క్యుమిన్ అనే సహజ యాంటీబయాటిక్ అంతర్గత వాపులు రాకుండా చూస్తుంది. నిరోధక శక్తిని పెంచుతుంది.
తేనె: దీనిలో యాంటీ మైక్రోబయల్ గుణాల అధికం. అనేక ఔషద గుణాల సమ్మేళనం. అంటువ్యాధులను అదుపు చేయడంలో ఉపయోగపడుతుంది. గాయాలను త్వరగా మానేలా చేస్తుంది.
వాము: ఆహారాన్ని తేలిగ్గా జీర్ణమయ్యేలా చేస్తుంది. పొత్తికడుపులో కణుతులు, పైౖల్స్, ఉబ్బసం వంటి వాటి నుంచి త్వరిత ఉపశమనం ఇస్తుంది.
అల్లం : తాజా అల్లంలోని సుగుణాలు నోటిలోని బ్యాక్టిరియాకు అడ్డుకట్ట వేస్తాయి.
* లవంగం, తులసి, దాల్చిన చెక్కలోనూ అనేక యాంటీ బ్యాక్ట్టీరియల్ గుణాలుంటాయి. అయితే వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నప్పుడు వీటిని వాడినా ఉపయోగం లేదు. వైద్యుల్ని సంప్రదించాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.