తెర వేద్దామా!

గాలీ, ధూళీ, ఇతరుల దృష్టి నేరుగా ఇంట్లోకి వచ్చేయకుండా కర్టెన్లు వాడుతుంటాం. అలాగని ఏదో ఒకటి అనుకోవద్దు. వైవిధ్యంగా ఉంటే ఇవి ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయి.

Published : 13 Jul 2023 00:31 IST

గాలీ, ధూళీ, ఇతరుల దృష్టి నేరుగా ఇంట్లోకి వచ్చేయకుండా కర్టెన్లు వాడుతుంటాం. అలాగని ఏదో ఒకటి అనుకోవద్దు. వైవిధ్యంగా ఉంటే ఇవి ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయి. మరి అవి ఆహ్లాదాన్ని పెంచేలా ఉండాలంటే ఎలాంటివి ఎంచుకోవాలో తెలుసా?

గోడల రంగులకు కాస్త భిన్నంగా ఉన్నవాటిని ఎంచుకోవద్దు. కాంట్రాస్ట్‌ రంగులూ, డిజైన్లూ కొత్తదనాన్ని తెస్తాయి. ఉదాహరణకు గోడలపై లేతరంగులు ఉంటే పరదాలను పూల డిజైన్‌లను ఎంచుకోండి.

  • గాలీ, వెలుతురూ కావాలనుకుంటే లేతరంగు కాటన్‌ పరదాలను ఎంపిక చేసుకోండి. ఇవి కిటికీలకు బాగుంటాయి. లోపలికి గాలీ, వెలుతురూ ధారళంగా ప్రసరించి...ఆ ప్రదేశం అందాన్ని రెట్టింపు చేస్తుంది.
  • వెలుతురు ఎక్కువగా వచ్చే గదుల కిటికీలకు, గుమ్మాలకు కాస్త ముదురు ఛాయలను తీసుకోండి. ఇంట్లో యాంటిక్‌ ఫర్నిచర్‌, ఇత్తడి వస్తువులతో ఇంటీరియర్‌ ఉన్నప్పుడు... పాత సిల్క్‌ చీరలూ, పెయింటింగ్‌లతో వేసిన కర్టెన్లను వేయండి.  
  • మోడర్న్‌ ఫర్నిచర్‌ ఉన్న గదుల్లో కర్టెన్లు వీలైనంత వరకూ సాదాగా లేకుండా చూసుకోండి. లేత రంగుల్లో చిన్న చిన్న ప్రింట్లతో ఉండేవి చూడముచ్చటగా ఉంటాయి. అలానే హాల్‌ను, డైనింగ్‌, కిచెన్‌ వంటి ప్రదేశాల్ని విభజించాలనుకున్నప్పుడు ఒకే దాన్ని ఎంచుకోవద్దు. తక్కువ వెడల్పుతో రెండు మూడు వేయాలి. పారదర్శకమైన డిజైన్లతో కాంట్రాస్ట్‌ లైనింగ్‌ డిజైన్లు ఉన్న కర్టెన్లు కొత్తగా కనిపించేలా చేస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని