దుమ్ము పడకుండా... వేడి తగ్గకుండా!
ఆహార పదార్థాలు వృథా కాకుండానో, నిల్వ ఉంచాలనో... ఫ్రిజ్‌లో పెడుతుంటాం. అయితే, వాటిని పెట్టేందుకు స్థలం లేక కొన్నిసార్లు, వాసన పట్టేస్తాయని ఇంకొన్నిసార్లు బయటే వదిలేస్తుంటాం.
ఆహార పదార్థాలు వృథా కాకుండానో, నిల్వ ఉంచాలనో... ఫ్రిజ్‌లో పెడుతుంటాం. అయితే, వాటిని పెట్టేందుకు స్థలం లేక కొన్నిసార్లు, వాసన పట్టేస్తాయని ఇంకొన్నిసార్లు బయటే వదిలేస్తుంటాం. మరికొన్ని సందర్భాల్లో రుచికరంగా వండి వడ్డించే వరకూ బయటపెట్టేస్తాం. ఇలాంటప్పుడు దుమ్మూ, ధూళీ పడటం, వేడి తగ్గిపోవడం వంటి ఇబ్బందులు ఎదురవు తుంటాయి. వంటగది అంతా పరిచేసినట్లూ కనిపిస్తాయి. ఇక, ఇలాంటి ఇబ్బంది లేకుడా ‘స్టాకబుల్ ఫూడ్ ఇన్సులేషన్ కవర్’ని ఎంచుకోవచ్చు. ఈ ఫోల్డబుల్ ఇన్సులేషన్ బాక్సులో... చాలా రకాలే పడతాయి. పాడవకుండానూ ఉంటాయి. వేడి తగ్గకుండా రుచికరంగానూ తినొచ్చు. అంతేకాదు, వీటిని ఇంట్లో ఏ మూలకైనా సులువుగా తీసుకెళ్లొచ్చు ఆహార పదార్థాలను కప్పి ఉంచడమే కాదు... వేడినీ తగ్గనివ్వవు. ఈ బాక్సులను నేరుగా ఫ్రిజ్‌లోనూ పెట్టుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.