సులువుగా పోగొట్టొచ్చు
కొత్త చీర మీద కాఫీ మరకా? ఎంతో ఇష్టంగా కొనుక్కున్న శ్రీవారి షర్టు మీద ఇంకు ఒలికిందా? ఇంకా ఈ కాలం బురద మచ్చలు అదనం. వాటిని ఎలా వదిలించాలా అని ఏవేవో ప్రయత్నిస్తుంటారు మన ఆడాళ్లు. అయినా కొన్నిసార్లు ఫలితం తక్కువే.
కొత్త చీర మీద కాఫీ మరకా? ఎంతో ఇష్టంగా కొనుక్కున్న శ్రీవారి షర్టు మీద ఇంకు ఒలికిందా? ఇంకా ఈ కాలం బురద మచ్చలు అదనం. వాటిని ఎలా వదిలించాలా అని ఏవేవో ప్రయత్నిస్తుంటారు మన ఆడాళ్లు. అయినా కొన్నిసార్లు ఫలితం తక్కువే. ఇక మీదట మీకా బెంగ అక్కర్లేదు. ఈ ‘స్టెయిన్ ఆఫ్’తో మరక పడినచోట రుద్దితే చాలు. మరకలేవైనా సునాయాసంగా వదిలిపోతాయి. ఇది రోలర్, పెన్, స్ప్రే, సాచెట్ల రూపంలో దొరుకుతోంది. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మార్కెట్లలోనూ లభిస్తోంది. ఇంకేం! ఎంచక్కా దీన్ని బ్యాగులో పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.