పాత కిటికీల అందం..

గోడ ఖాళీగా అనిపించే చోట, గదిలో కిటికీ లేనప్పుడు వీటిని అలంకరణగా అమర్చుకోవచ్చు. ముందుగా తాజాగా కనిపించే రంగురంగుల ప్లాస్టిక్‌ పూల కొమ్మలను సిద్ధం చేసుకోవాలి. గది గోడ వర్ణానికి తగినట్లుగా మ్యాచ్‌ అయ్యేలా కిటికీకి పెయింటింగ్‌ వేసి ఆరనివ్వాలి.

Published : 18 Jul 2023 00:30 IST

ఇంటిని మరమ్మతు చేసేటప్పుడు, కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు పాత కిటికీలను వృథాగా వదిలేస్తుంటాం. వీటినీ ఇంటికి అలంకరణగా మార్చుకోవచ్చు. వీటిలో ఇంటికి తగ్గవి ఎంచుకొని గృహాలంకరణలో భాగం చేసుకోవచ్చు.

గోడ ఖాళీగా అనిపించే చోట, గదిలో కిటికీ లేనప్పుడు వీటిని అలంకరణగా అమర్చుకోవచ్చు. ముందుగా తాజాగా కనిపించే రంగురంగుల ప్లాస్టిక్‌ పూల కొమ్మలను సిద్ధం చేసుకోవాలి. గది గోడ వర్ణానికి తగినట్లుగా మ్యాచ్‌ అయ్యేలా కిటికీకి పెయింటింగ్‌ వేసి ఆరనివ్వాలి. దాన్ని మేకులతో గోడకు అమర్చి, అందులో పూల కొమ్మలు పూసినట్లుగా సర్దితే చాలు. పాత ఫర్నిచర్‌ లుక్‌ రావాలంటే పెయింట్‌ వేయకుండా పాలిష్‌ మాత్రం చేసి గోడకు అమర్చాలి.  

తోటలో.. ఇంటి బాల్కనీ లేదా తోటలో ప్రహరీకి కూడా అందాన్నిస్తాయివి. తోట గోడకు దీన్ని అమర్చి ఆ తర్వాత రెండు మూడు పూల తొట్టెలను కిటికీ ఊసలకు తీగతో కలిపి కట్టేయాలి. అలాగే బాల్కనీ గోడకు కిటికీ ఏర్పాటు చేసి, తాజాగా కనిపించే ముదురువర్ణం పూల గుత్తులు, ఆకుల కొమ్మలను కలిపి సర్దితే చాలు. రంగులమయంగా ఆ చోటంతా అందంగా మారిపోతుంది. అలాగే మనీప్లాంట్‌లాంటి తీగ మొక్కను కిటికీ ఫ్రేం లోపలి వైపు నుంచి పాకుతున్నట్లుగా గోడకు అమర్చినా సహజత్వం వికసిస్తుంది. అంతేకాదు, పడకగదిలో కిటికీ లేదనే భావన లేకుండా ఇటువంటి పాత కిటికీని సర్దుకోవచ్చు. ముదురువర్ణం పెయింటింగ్‌ వేసి గోడకు మేకులతో దీన్ని అమర్చాలి. వెనుకవైపు వచ్చేలా కర్టెన్లను, ముందువైపు రెండు మూడు ఇండోర్‌ప్లాంట్స్‌ను సర్దితే నిజమైన కిటికీ ఉన్నట్లే అనిపిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని