బేరమాడితేనే...

ఆర్డర్‌ పెట్టడమే తరవు ఏదీ కావాలంటే అది కాళ్లముందుకు వచ్చి చేరుతుంది. దాంతో పొదుపు పాఠాలు మరచిపోతున్నాం. ఆన్‌లైన్‌ ఆర్డర్లు ఒక ఎత్తైతే.. మార్టుల్లోకి వెళ్లగానే అవసరం లేకపోయినా  ఏదిపడితే అది కొనేస్తున్నాం.

Updated : 19 Jul 2023 05:05 IST

ఆర్డర్‌ పెట్టడమే తరవు ఏదీ కావాలంటే అది కాళ్లముందుకు వచ్చి చేరుతుంది. దాంతో పొదుపు పాఠాలు మరచిపోతున్నాం. ఆన్‌లైన్‌ ఆర్డర్లు ఒక ఎత్తైతే.. మార్టుల్లోకి వెళ్లగానే అవసరం లేకపోయినా  ఏదిపడితే అది కొనేస్తున్నాం. ఆ పద్ధతి మంచిది కాదంటున్నారు నిపుణులు...

మీలో ఎంతమంది మార్టులకు వెళ్లి అవసరం ఉన్నా, లేకున్నా సరకులను కొని తెచ్చుకుని ఉంటారు. కావాలసిన వస్తువుల జాబితా లేకపోవడం వల్లనే ఈ సమస్య. వీలైనంత వరకు రైతుబజార్లనో, మార్కెట్లోనో అనుసరించండి. లేదు మేం మార్టుకే వెళ్తాం అంటే... ముందుగానే కావాల్సిన వస్తువుల జాబితాను సిద్ధం చేసుకోండి. దీనివల్ల అనవసరపు కొనుగోళ్లను నియంత్రించవచ్చు.

 మార్టులు మధ్యతరగతి పొదుపు హుండీకి చిల్లులు వేస్తున్నాయి. ఇంటి నుంచి బయలుదేరినప్పుడే గతనెల అనుభవాన్ని, పెరిగిన ధరలను అంచనా వేసి డబ్బులను పట్టుకోండి. దీనివల్ల అదనంగా ఏదైనా కొనాలన్నా డబ్బులు లేవంటూ వెనక్కి వచ్చేస్తాం. డిస్కౌంటునో, బ్రాండ్‌ దొరుకుతుందో లేదో అనో వస్తువులను కొనడం మంచిది కాదు. కొనేదగ్గర అవసరాలను మాత్రమే గుర్తుంచుకోండి. వస్తువులు కొనగా డబ్బులు మిగిలితే పొదుపు చేయండి. అలా చేసిన డబ్బులు దేనికైనా ఉపయోగపడతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని