కుండీలు కొంటున్నారా?

అలంకరణ, ఆరోగ్యం, వ్యాపకం ఏదైతేనేం.. మొక్కలు పెంచేవారు పెరుగుతున్నారు. వాటి కోసం రంగురంగుల కుండీలు ఎంచేవారూ ఎక్కువే. మరి అవి పర్యావరణ హితమేనా?

Published : 22 Jul 2023 00:11 IST

అలంకరణ, ఆరోగ్యం, వ్యాపకం ఏదైతేనేం.. మొక్కలు పెంచేవారు పెరుగుతున్నారు. వాటి కోసం రంగురంగుల కుండీలు ఎంచేవారూ ఎక్కువే. మరి అవి పర్యావరణ హితమేనా?

  • కాగితం.. మందమైన కాగితంతో చేసిన కుండీలు ప్రయత్నించండి. ఇవి వేర్లను చల్లగా ఉంచడమే కాదు.. మొక్క పెరుగుదలలోనూ సాయపడతాయి. పైగా భూమిలోనూ త్వరగా కలిసిపోతాయి. అయితే కాలవ్యవధి తక్కువ. కాబట్టి, కూరగాయ మొక్కలకు అనుకూలం.
  • పీచు.. కొబ్బరి పీచుతో చేసినవి ఎంచుకోండి. ఇవి భిన్న రంగుల్లోనూ దొరుకుతున్నాయి. పర్యావరణ హితం, ఖర్చూ తక్కువ.
  • టెర్రకోట, సెరామిక్‌.. వీటిని ఒకరకమైన మట్టితో తయారు చేస్తారు. భిన్న రంగులు, ఆకృతుల్లో దొరుకుతాయి. మొక్క పెరుగుదలకు కావాల్సిన పోషకాలూ అందుతాయి. అయితే వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే పగిలే ప్రమాదం ఉంటుంది. క్లాసీ లుక్‌ కావాలంటే సెరామిక్‌వి ఎంచుకోవచ్చు. గృహాలంకరణ మొక్కలకు ఇవి ప్రత్యేక అందాన్ని తెచ్చిపెడతాయి.
  • చెక్క, సిమెంటు.. తేమను ఎక్కువసేపు పట్టి ఉంచుతాయివి. దీంతో వేర్లూ చల్లగా ఉంటాయి. అలా మొక్క పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. పాత, పనికిరాని ఫర్నిచర్‌నీ వీటి తయారీకి ఉపయోగించొచ్చు. కాస్త ఓపిక, సృజనాత్మకత ఉంటే సిమెంటువి తయారు చేసుకోవచ్చు. కావాల్సిన సామగ్రి ఇప్పుడు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. లేదంటే బయటా కొనుక్కోవచ్చు.
  • లోహాలు.. ఇత్తడి, కంచు, స్టీలు.. వంటి భిన్న లోహాల్లోనూ కుండీలు దొరుకుతున్నాయి. ఇంటికి కొత్త కళను తెచ్చే ఇవి త్వరగా పాడవవు కూడా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని