పోపుల డబ్బాలే పొదుపు బ్యాంకులు

మన అమ్మ, అమ్మమ్మలకి పోపుల డబ్బాలే బ్యాంకులు. ఏ చిన్న చిల్లర ఉన్నా వెంటనే వాటిని తమ బ్యాంకులకు చేర్చేవారు.

Published : 22 Jul 2023 00:11 IST

మన అమ్మ, అమ్మమ్మలకి పోపుల డబ్బాలే బ్యాంకులు. ఏ చిన్న చిల్లర ఉన్నా వెంటనే వాటిని తమ బ్యాంకులకు చేర్చేవారు. ఎవరికీ తెలియకూడదని చెప్పేవారు కాదు. నెల గడిచాక తీసుకుని వాటిని అవసరాలకు ఉపయోగించేవారు, లేదంటే వస్తువులో, బంగారమో కొని భవిష్యత్తుకు ఆర్థిక బాటలు వేసుకునేవారు. కానీ మనం...

  • ఏది పడితే అది కొనడం.. యూపీఐ పేమెంట్లు చేయడం. చివరి రూపాయీ ఖర్చై, జీరో బ్యాలెన్స్‌ అని చూపించే దాకా ఖర్చు చేస్తాం. అందుకే ఆన్‌లైన్‌ పేమెంట్లను ఆపి చిన్నచిన్న వాటికి నగదు చెల్లింపులను ఎంచుకోండి. వచ్చిన చిల్లరను పాత పద్ధతిలో ఏదో ఒక డబ్బాలోనో, మీ దృష్టి పడని స్థలంలోనో దాచేయండి. నెలాఖరుకు ఎంత కూడబెడతారో చూడండి.
  • అనుకుని, ప్రణాళికాబద్ధంగా దాచుకున్న సొమ్ము కన్నా, ఇలా ఎప్పటికప్పుడు లెక్కపెట్టకుండా దాచినదే ఎక్కువవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో మీరు ఉపయోగించినా, మీ భాగస్వామికి ఇచ్చినా అదనపు ఆనందం జోడవుతుంది. ఈ పోపుల డబ్బా సూత్రాన్ని పాటిస్తారు కదూ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని