జ్యూస్‌ తయారీ సులభంగా....

పండ్ల రసాలను తీయడానికి ఎన్నో మిక్సీ జార్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ బత్తాయి.. నారింజ వంటివాటి విషయానికి వచ్చేసరికే వాటిని అదిమి పట్టి ఉంచక తప్పదు.

Published : 23 Jul 2023 00:16 IST

పండ్ల రసాలను తీయడానికి ఎన్నో మిక్సీ జార్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ బత్తాయి.. నారింజ వంటివాటి విషయానికి వచ్చేసరికే వాటిని అదిమి పట్టి ఉంచక తప్పదు. తర్వాత వడపోసుకోవడం అదనపు పని. అందుకే జ్యూసులు తీయడం మనకో పెద్ద పనిలా తోస్తుంది. ఈ ప్రక్రియనీ సులభం చేస్తూ వచ్చిందే.. ‘ఎలక్ట్రిక్‌ క్రియేటివ్‌ పోర్టబుల్‌ జ్యూస్‌ మేకర్‌’. బ్యాటరీతో పని చేస్తుంది. అవసరమైనప్పుడు ఛార్జింగ్‌ పెట్టుకుంటే చాలు. పెద్దగా కరెంటూ అవసరం ఉండదు. దీని వాడకమూ తేలికే! బత్తాయి, నారింజ సగం ముక్కలు చేసి పెట్టేయొచ్చు. ఇతర పండ్లలను నేరుగా వేసి బటన్‌ నొక్కితే చాలు. చెత్త, గింజలు లేని జ్యూస్‌ వచ్చేస్తుంది. బాగుంది కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని