వానల్లో బ్యాగులు జాగ్రత్త!
దుస్తులకన్నా బ్యాగులను ప్రాణంగా చూసుకునే అమ్మాయిలెందరో! ఖరీదు ఎక్కువైనా దాచుకొని మరీ కొంటుంటారు. వాటిల్లో లెదర్‌వే ఎక్కువ మంది ఎంపిక. అసలే వానాకాలం.. తడిస్తే పాడైపోవూ? ఎక్కువ కాలం మన్నాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి..
దుస్తులకన్నా బ్యాగులను ప్రాణంగా చూసుకునే అమ్మాయిలెందరో! ఖరీదు ఎక్కువైనా దాచుకొని మరీ కొంటుంటారు. వాటిల్లో లెదర్‌వే ఎక్కువ మంది ఎంపిక. అసలే వానాకాలం.. తడిస్తే పాడైపోవూ? ఎక్కువ కాలం మన్నాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి..
తడిస్తే.. లెదర్‌బ్యాగు తడిస్తే వెంటనే తుడవాలి. లేదంటే వాటిపై ఫంగస్ చేరి త్వరగా పాడవుతుంది. బయటే కాదు.. లోపలా తడిపోయేలా చూసుకోవాలి. అప్పుడే ఎక్కువ కాలం మన్నుతుంది. న్యూస్‌పేపర్లు ఉండలుగా చుట్టి పెట్టుంచి, తొలగించినా తేమంతా పోతుంది.
ప్రతిసారి.. కళ్లకు కనిపిస్తేనే కాదు.. కనిపించకుండానూ దుమ్ము చేరుతుంది. దానికి తేమ కూడా తోడైతే బ్యాగులు ఇంకా త్వరగా పాడవుతాయి. కాబట్టి, బయటకు వెళ్లొచ్చిన ప్రతిసారి మెత్తటి వస్త్రం లేదా బ్రష్‌తో బ్యాగును శుభ్రపరచడం తప్పనిసరి.
వేడికి దూరంగా.. తేమ చేటు అని ఎండ రాగానే బయట పెట్టేస్తున్నారా? త్వరగా ఆరతాయని హెయిర్ డ్రయ్యర్ సాయం తీసుకుంటున్నారా? రెండూ ప్రమాదమే. వీటి వేడి లెదర్ సహజత్వాన్ని కొల్పోయేలా చేస్తాయి. మన్నిక కూడా తగ్గుతుంది. ఒకవేళ తప్పనిసరి అయితే హెయిర్ డ్రయ్యర్‌ని కూల్ మోడ్‌లో పెట్టి, దూరంగా ఉంచి ఆరబెట్టండి. లేదూ టేబుల్ ఫ్యాన్ ముందు ఉంచినా సరే.
పాలిష్.. బయటికి వెళ్లే ముందు పాలిష్ చేయండి. వెజిటబుల్ ఆయిల్, వ్యాక్స్ ఉన్న రకాలు ఎంచుకుంటే మేలు. ఇవి లెదర్‌ను మెరిసేలా చేయడమే కాదు.. వాన నీరు బ్యాగుపై నిలవకుండానూ చూస్తాయి.
మాయిశ్చరైజ్ చేయాలి.. చర్మం మాదిరిగానే లెదర్ వస్తువులను కూడా మాయిశ్చరైజ్ చేయాలి. ఇందుకు సహజసిద్ధ నూనెలు, క్రీములు, లెదర్ వ్యాక్స్‌లు ఉత్తమ ఎంపిక. శుభ్రం చేశాక భద్రపరిచే ముందు వీటిలో నచ్చినదాన్ని బ్యాగుపై పలుచని పూతలా వేస్తే సరిపోతుంది. ఇవి మెరిసేలా చేస్తూనే పాడవకుండా కాపాడతాయి. అలాగే ఈ బ్యాగులను నేరుగా అలమరాలో పెట్టేయొద్దు. కాటన్ వస్త్రంలో చుట్టి గానీ, క్లాత్ బ్యాగులో ఉంచిగానీ భద్రపరచాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.