షాపింగ్‌కు వెళుతున్నారా...
అవసరం ఉన్నప్పటి కన్నా, బోర్ కొట్టినప్పుడు ‘సరదాగా షాపింగ్’ అంటూ కాలు బయటపెడుతుంటాం. ఈ అలవాటుతో అనవసర ఖర్చుల బారిన పడతాం.
అవసరం ఉన్నప్పటి కన్నా, బోర్ కొట్టినప్పుడు ‘సరదాగా షాపింగ్’ అంటూ కాలు బయటపెడుతుంటాం. ఈ అలవాటుతో అనవసర ఖర్చుల బారిన పడతాం. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది..
ఇంటికి కావలసిన లేదా వ్యక్తిగత, పిల్లల అవసరాలకు షాపింగ్ చేయాలనుకుంటే ముందుగా ఓ పట్టిక తయారుచేయాలి. అందులో అత్యవసరమైనవాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. వచ్చే నెలలో కూడా తీసుకోవచ్చు అనే వాటిని పట్టిక నుంచి కొట్టేయాలి. దాంతో కొనాల్సిన వస్తువుల సంఖ్యతోపాటు అదనపు ఖర్చుకు కళ్లెం వేయొచ్చు. అలాగే పట్టికలోని వస్తువులన్నీ ఒకేచోట దొరికితే మరీ మంచిది. పదిచోట్ల తిరుగుతున్నప్పుడు కొత్త మోడల్స్ దుస్తులు లేదా యాక్సరీస్ వంటివి, అప్పటికి అనవసరమైనవి మనల్ని ఆకర్షిస్తాయి. దాంతో వాటినీ కొనాలనిపిస్తుంది. ఇది ఖర్చును పెంచుతుంది. ముఖ్యమైన వాటిని మిస్ అవుతాం.
బడ్జెట్‌తో.. బజారుకెళ్లేటప్పుడు బడ్జెట్ తప్పనిసరి. దాన్ని దాటకుండా జాగ్రత్తపడుతూ షాపింగ్ చేయగలగాలి. ప్రతి నెలా ఆదాయం నుంచి ఇంటికి, పిల్లలకు కావాల్సిన వస్తువుల కోసం తీసిన నగదు నుంచి కూడా వీలైతే పొదుపు చేయాలి. ఇందుకు 50-30-20 నియమాన్ని పాటించాలిలి. 50% సామాన్లకు, 30 శాతాన్ని పిల్లలకు కావాల్సినవి ఇప్పించడంతో షాపింగ్ ముగించాలి. బయటి ఆహారం కాకుండా వీలైనంత ఇంటి భోజనాన్ని పిల్లలకు అలవాటు చేస్తే ఆరోగ్యం సొంతమవుతుంది. ఖర్చు కూడా తగ్గుతుంది. మొత్తంపై 20 శాతాన్ని మిగల్చగలిగితే అనుకోకుండా ఎదురయ్యే అత్యవసరాలకు వాటిని వినియోగించొచ్చు. లేదా పొదుపు ఖాతాలో చేర్చొచ్చు.
ప్రత్యేకంగా.. నెలనెలా కట్టేయొచ్చనే ఆలోచనతో క్రెడిట్ కార్డు వంటివి వినియోగించకపోవడం మేలు. అప్పటికి అవసరం తీరినా, ఆ తర్వాత కార్డులో చెల్లించాల్సిన నగదుపై వడ్డీ, ఇతర ఛార్జీలు భారంగా మారే ప్రమాదం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.