దుస్తులు త్వరగా ఆరాలా?

ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. దీని కారణంగా మనకు పోగుపడే పనుల్లో దుస్తులొకటి! రోజూ ఉతకలేం.  ఉతికినా త్వరగా ఆరవు. ఆరకపోతే వాసన అదనం.

Published : 27 Jul 2023 00:02 IST

ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. దీని కారణంగా మనకు పోగుపడే పనుల్లో దుస్తులొకటి! రోజూ ఉతకలేం.  ఉతికినా త్వరగా ఆరవు. ఆరకపోతే వాసన అదనం. మరెలాగంటారా? వీటిని ప్రయత్నించేయండి.

దుస్తులు ఉతికాక పిండినా కొన్నిసార్లు నీళ్లు కారుతుంటాయి. అలాంటప్పుడు తొందరపడి ఆరేయొద్దు. పూర్తిగా నీరంతా పోయేదాకా బకెట్‌పై అలాగే వేసుంచండి. నీరు కారడం ఆగిన తర్వాత ఆరేస్తే త్వరగా ఎండుతాయి.

తాడుమీద వేస్తే పైవైపు ఆరడం.. తీగపై వేసినచోట పచ్చిగా ఉండటం మనకు అనుభవమే! ఒకపక్క ఆరి, మరోపక్క తడిగా ఉన్నా సూక్ష్మజీవులకు నెలవుగా మారతాయి. కాబట్టి, హ్యాంగర్లకు తగిలించి వాటిని తాడుకు వేలాడదీస్తే ఈ సమస్య ఉండదు. వాటిని వరుసగా ఫ్యాన్‌ లేదా హీటర్‌ ఉన్న గదిలో ఉంచినా త్వరగా ఆరతాయి.

 వాషింగ్‌ మెషిన్‌లో సాధారణంగానే డ్రై అవుతాయి. ఓసారి వాటిని బయటకు తీసి, మళ్లీ డ్రైయర్‌లో వేయండి. తేమ చాలావరకూ తొలగి పోతుంది.

 హెయిర్‌ డ్రైయర్‌ ఉందా? దాంతో ప్రయత్నించి చూడండి. కూల్‌ సెట్టింగ్స్‌లో ఉంచి, అరచేతి దూరంలో పెట్టి ఆరబెడితే సరి. అత్యసవరం అనుకున్న డ్రస్‌ను ఇస్త్రీపెట్టెతో రుద్దితే తడి పోతుంది, ఐరన్‌ కూడా పూర్తవుతుంది. వాతావరణంలోని అధిక తేమ కూడా దుస్తులు త్వరగా ఆరకుండా చేయగలదు. డీహ్యుమిడిఫయర్లని మార్కెట్‌లో దొరుకుతున్నాయి. వాటిని దుస్తులు వేలాడేసిన గదిలో ఉంచినా ఫలితం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని