గృహశోభకు సింపుల్ చిట్కాలు
ఇల్లు అందంగా ఉంటే మనకు ఆహ్లాదంగా ఉంటుంది. మరి ఉన్న సరంజామాని పొందిగ్గా అమర్చుకునేందుకు ఇంటీరియర్ డిజైనర్లు సూచిస్తున్న సలహాలు పాటించి చూడండి.
Published : 28 Jul 2023 00:17 IST
ఇల్లు అందంగా ఉంటే మనకు ఆహ్లాదంగా ఉంటుంది. మరి ఉన్న సరంజామాని పొందిగ్గా అమర్చుకునేందుకు ఇంటీరియర్ డిజైనర్లు సూచిస్తున్న సలహాలు పాటించి చూడండి...
- కుర్చీలు, సోఫాలు లాంటివి స్టోరేజ్‌కి పనికొచ్చే తరహావి కొనండి. అప్పుడు చిన్న చిన్న వస్తువులు అందులోకి వెళ్లిపోయి కొంత ఖాళీ స్థలం మిగులుతుంది.
- వంటింటి కబోర్డ్స్‌లో ఉప్పూ పప్పుల డబ్బాలు కావచ్చు, హాలు, డ్రాయింగ్ రూముల అరల్లో అలంకరణ వస్తువులూ బొమ్మలు కావచ్చు.. ఒక దానికొకటి మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. అప్పుడే చూడముచ్చటగా ఉంటాయి.
- డైనింగ్ టేబులు పక్కనున్న గోడ మీద చెట్టుచేమల్లాంటి ల్యాండ్‌స్కేప్ చిత్రించండి. అద్వితీయంగా ఉంటుంది. అయితే కర్టెను, టేబుల్ క్లాత్, కార్పెట్ మొదలైనవి ఆ చిత్రానికి అనుకూలమైన రంగులవ్వాలి.
- ఈ తరం పిల్లలకి ఎన్ని దుస్తులున్నా తృప్తి లేక ఇంకా ఇంకా కొంటూనే ఉంటారు. మరి అవన్నీ భద్రపరచడానికి బీరువాలు, వార్డ్‌రోబ్‌లూ సరిపోవు కదా! కబోర్డ్స్ పక్కన రాడ్స్ ఏర్పాటు చేసుకుంటే దాంతో చాలా దుస్తులు అక్కడ హ్యాంగర్లకి తగిలించవచ్చు.
- రాక్స్‌లో పై వరసన కొన్ని హుక్స్ పెట్టిస్తే.. హ్యాండ్‌బ్యాగ్, షాపింగ్‌బ్యాగ్, బెల్టులు లాంటివి తగిలించవచ్చు. అడ్డు అనిపించవు.
- సాధారణంగా పుస్తకాలను సబ్జెక్టు పరంగా సర్దుకుంటాం. కానీ రంగు ప్రకారం సర్ది చూడండి, పుస్తకాల పట్ల మోజు లేనివాళ్లు కూడా ఆకర్షితులై ఆసక్తిగా చూస్తారు.
- అల్మరలు, సొరుగుల్లో ఎంత చిన్న చిన్న అరలుంటే అంత ఎక్కువ సామాను వాటిల్లో ఒదిగిపోతుంది.
- మెట్ల దగ్గరున్న కాస్త స్థలంలో చిన్న టీపాయ్, బుల్లి కుర్చీలు వేశామంటే పిల్లల రీడింగ్ ప్లేస్‌లా ఎంత ముచ్చటగొల్పుతుందో!
Trending
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.