చక్కగా కడిగేస్తుంది

ఈ త్రీఇన్‌వన్‌ ఎలక్ట్రిక్‌ స్క్రబ్బర్‌, బ్రష్‌ అన్నింటినీ సునాయాసంగా శుభ్రం చేసేస్తుంది. వంటగదిలో గ్యాస్‌స్టౌనీ, స్టెయిన్‌లెస్‌స్టీల్‌ సింకులనూ, టైల్స్‌, మార్బుల్స్‌నూ, స్నానాలగది ఇంకా షూలను కూడా మిలామిలా మెరిసేట్టు చేస్తుంది. దీనిలో మూడు రకాల బ్రష్‌లుంటాయి.

Updated : 29 Jul 2023 16:10 IST

త్రీఇన్‌వన్‌ ఎలక్ట్రిక్‌ స్క్రబ్బర్‌, బ్రష్‌ అన్నింటినీ సునాయాసంగా శుభ్రం చేసేస్తుంది. వంటగదిలో గ్యాస్‌స్టౌనీ, స్టెయిన్‌లెస్‌స్టీల్‌ సింకులనూ, టైల్స్‌, మార్బుల్స్‌నూ, స్నానాలగది.. ఇంకా షూలను కూడా మిలామిలా మెరిసేట్టు చేస్తుంది. దీనిలో మూడు రకాల బ్రష్‌లుంటాయి. అవసరానికి తగిన బ్రష్‌ని ఎంచుకుని శుభ్రం చేస్తే సరిపోతుంది. అంతేకాదు ఒక్కసారి ఛార్జింగ్‌ పెడితే రెండు గంటలు పని చేస్తుంది. చేతిలో ఇమిడిపోయే ఈ పరికరం వాడకం కూడా చాలా తేలికే. దీని వెనకుండే మూతను తెరిచి దానిలో లిక్విడ్‌ సోప్‌ వేసి ఆన్‌ చేస్తే స్క్రబ్‌ చేసేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని