మొక్కలకు దాల్చిన చెక్క..

పోపుల పెట్టెలో సహజసిద్ధమైన ఔషధాల్లో ఒకటైన దాల్చిన చెక్క తోటనూ ఆరోగ్యంగా ఉంచుతుంది.శిలీంద్ర సంహారిణిగా పనిచేసి మొక్కల ఎదుగుదలకు తోడ్పడుతుంది.

Published : 30 Jul 2023 00:05 IST

పోపుల పెట్టెలో సహజసిద్ధమైన ఔషధాల్లో ఒకటైన దాల్చిన చెక్క తోటనూ ఆరోగ్యంగా ఉంచుతుంది. శిలీంద్ర సంహారిణిగా పనిచేసి మొక్కల ఎదుగుదలకు తోడ్పడుతుంది.

మొలకలొచ్చే ఈ వర్షాకాలంలో మట్టి నుంచి మొక్క బయటకు వచ్చేలోపు కొన్ని రకాల వ్యాధులు సోకుతుంటాయి. దీంతో ప్రాథమిక దశలోనే మొలకలు వడలిపోయినట్లవుతాయి. ఎదుగుదల లేకపోవడం లేదా పైకి వచ్చిన వెంటనే ఎండిపోవడం జరుగుతుంది. ఫంగస్‌ లేదా మట్టిలోని కొన్ని పరిస్థితులు దీనికి కారణం కావొచ్చు. కొత్తిమీర, మెంతి, వంగ, తోటకూర విత్తనాలు చల్లేటప్పుడు ఆ తొట్టె లేదా ట్రేలో చెంచా దాల్చిన చెక్క పొడి చల్లడం మంచిది. యాంటీ ఫంగస్‌ లక్షణాలు పుష్కలంగా ఉండే ఇది మట్టిలో కలిసి, మొలకలు ఆరోగ్యంగా పెరగడానికి సాయపడుతుంది. 

తోటలో.. మొక్కల మధ్య వర్షం కారణంగా తడిచేరి పుట్టగొడుగులెక్కువగా పెరుగుతుంటాయి. వీటిని నిరోధించడానికి తోటంతా దాల్చినచెక్క పొడి కలిపిన మట్టిని చల్లాలి. లేదంటే వీటివల్ల ఫంగస్‌ మొక్కలన్నింటికీ పాకి పలురకాల వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. అలాగే మందార, గులాబీ, మల్లి వంటి మొక్కలను అంటుకట్టడానికి వర్షాకాలం సరైన సమయం. ధృఢమైన కాండం నుంచి తీసిన కొమ్మను మట్టిలో ఉంచే ముందు ఆ కాడ చివర చిటికెడు దాల్చిన చెక్క పొడి అద్దిన తర్వాత నాటాలి. దీంతో కొమ్మ చిగురించడం మొదలవుతుంది. ఈ సీజన్‌లో వాతావరణంలోని తేమ కారణంగా పలురకాల తెగుళ్లు మొక్కలకు సోకుతుంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే తోట చుట్టూ దాల్చినచెక్క పొడి కలిపిన మట్టి చల్లడం మంచిది. మందార, గులాబీ మొగ్గలు పూలుగా విరియకుండానే రాలిపోతున్నప్పుడు తొట్టె లోపల మొక్కకు దూరంగా పావుచెంచా దాల్చిన చెక్కపొడి చల్లాలి. ఇది మట్టికి కావాల్సిన పోషకాలను అందించడమే కాకుండా వ్యాధులను అరికడుతుంది. మొక్కలకు చెడుచేసే కీటకాలను దరిచేరకుండా పరిరక్షిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని