లక్కీబాంబూ పెంచుతున్నారా!
ఇంటి అలంకరణ, అదృష్టానికి ప్రతీక అని లక్కీ బాంబూ తెచ్చుకుంటాం. అదేమో ఉన్నట్లుండి వడలిపోతుంది. ఆకులన్నీ పసుపు వర్ణంలోకి మారతాయి.
ఇంటి అలంకరణ, అదృష్టానికి ప్రతీక అని లక్కీ బాంబూ తెచ్చుకుంటాం. అదేమో ఉన్నట్లుండి వడలిపోతుంది. ఆకులన్నీ పసుపు వర్ణంలోకి మారతాయి. చుట్టుపక్కల వాతావరణంలోని గాలిని శుభ్రపరుస్తూ, టీపాయి, భోజనబల్లపై అందంగా ఇమిడిపోయే ఈ వెదురు మొక్కనెలా సంరక్షించుకోవాలో చూద్దాం..
ఈ మొక్కను కొనేటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొమ్మలు, ఆకులు తాజాగా ఉన్నదాన్ని ఎంచుకోవాలి. క్లోరిన్ కలిపినవి కాకుండా స్వచ్ఛమైన నీటిని అందించాలి. కనీసం నెలకొకసారి జార్‌లో నీటిని మారిస్తే కావాల్సిన పోషకాలు అందుతాయి. ఎండపడని చోటు దీనికి మేలు. అప్పుడే కొమ్మలు, ఆకులు పసుపు వర్ణంలోకి మారకుండా ఆకుపచ్చగా ఉంటాయి. ఒకట్రెండు ఆకులు పసుపుగా మారుతున్నట్లు కనిపిస్తే, వెంటనే వాటిని మొక్క నుంచి వేరు చేయాలి. లేదా ఆ మేరకు కత్తిరించాలి. మిగిలిన కాండాన్ని చెంచా దాల్చినచెక్క పొడి కలిపిన నీటిలో వేర్లు మునిగేలా అరగంటసేపు నాననివ్వాలి. ఈలోపు కొబ్బరిపీచు, సేంద్రియ ఎరువు మిశ్రమం కలిపిన మట్టిని నింపిన తొట్టెను సిద్ధం చేసుకోవాలి. దాల్చినచెక్క పొడి నీటిలో ఉంచిన మొక్కను ఈ తొట్టెలో నాటాలి. తగినంత నీటిని స్ప్రే చేస్తుంటే రెండు మూడు రోజులకు తేటగా కనిపిస్తుంది. క్రమేపీ చిగురిస్తుంది.
ట్రిమ్మింగ్.. మొక్క బాగా పెరుగుతున్నప్పుడు ట్రిమ్ చేస్తుండాలి. కావాల్సినంత ఎత్తు వరకు ఉంచి, పదునైన కత్తితో కణుపుల వద్ద కట్ చేయాలి. కావాల్సిన ఆకృతుల్లోకీ వీటిని మార్చుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.