గోడలపై మరకలు పోవట్లేదా!
దుస్తులు, టైల్స్‌పై మరకలు తొలగించడం సులభమే. కానీ పెయింట్ వేసిన గోడపై మరకలను తొలగించడం కొంచెం కష్టమైన పనే. అందులోనూ నూనె మరకలు పడితే ఇంకా కష్టం కదా! వీటిని శుభ్రం చేయడం శ్రమించాల్సిన పనే అయినప్పటికీ కొన్ని ఇంటి చిట్కాలతో వీటిని చక్కగా వదిలించవచ్చు.

- ఒక స్పూను బేకింగ్ సోడాను తీసుకుని కొద్దిగా నీరు కలిపి పేస్టులా చేసి నూనె మరకలున్న చోట రాయాలి. అరగంటాగి శుభ్రమైన వస్త్రంతో తుడిస్తే నూనె మరకలు తొలగిపోతాయి.
- లిక్విడ్ డిష్‌వాషర్‌ను గోడలపై బాటిల్‌తో స్ప్రే చేసి గంటపాటు వదిలేయాలి. తర్వాత వేడినీటితో కడిగి మెత్తని క్లాత్‌తో శుభ్రం చేస్తే సరి..
- వంటల్లో ఉపయోగించే వెనిగర్ కూడా గోడలపై నూనె మరకలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. వెనిగర్, నీళ్లు సమాన పరిమాణంలో తీసుకోవాలి. ఒక స్పాంజ్ తీసుకుని మరకలున్న చోట రాయాలి. ఇరవై నిమిషాల తర్వాత మెత్తని వస్త్రంతో తుడిస్తే సరి.
- నూనె మరకలు ఎక్కువగా ఉంటే గోడపై ఒక పేపరు ఉంచి దానిపై ఐరన్‌బాక్స్, హెయిర్ డ్రయ్యర్‌ను ఉపయోగించి వేడి చేయాలి. ఇలా చేయడం వల్ల పేరుకుపోయిన నూనె మొత్తం బయటకు వచ్చేస్తుంది. శుభ్రం చేయడం తేలికవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.