పచ్చగా.. ఆరోగ్యంగా
ఇంటికి అందాన్నీ, మనసుకు ఆహ్లాదాన్నీ ఇస్తాయి మొక్కలు. అందుకే, స్థలం లేకపోయినా సరే, వీటిని పెంచాలని ఆరాటపడుతున్నారు అందరూ. అయితే, కొందరు వీటి సంరక్షణ సూత్రాలు తెలియక సతమతమవుతున్నారు. అలాంటివారికోసమే ఈ చిట్కాలు.
ఇంటికి అందాన్నీ, మనసుకు ఆహ్లాదాన్నీ ఇస్తాయి మొక్కలు. అందుకే, స్థలం లేకపోయినా సరే, వీటిని పెంచాలని ఆరాటపడుతున్నారు అందరూ. అయితే, కొందరు వీటి సంరక్షణ సూత్రాలు తెలియక సతమతమవుతున్నారు. అలాంటివారికోసమే ఈ చిట్కాలు.
- ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతుంటే అది పొటాషియం లోపానికి సంకేతం కావొచ్చు. దీనివల్ల పండ్లూ, పూల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఆకుల అంచులు, మొగ్గలు ఎండిపోతాయి. ఈ స్థితిని గుర్తించినప్పుడు రంపపు పొట్టు, ఎప్సం సాల్ట్‌ని నీళ్లల్లో కలపాలి. దీన్ని మొక్కలకు అందిస్తే సహజంగా పొటాషియం అందుతుంది. బంగాళాదుంప పొట్టు, ఉల్లి, అరటి తొక్కల్ని రెండు రోజులపాటు నీళ్లలో నానబెట్టి మొక్కలకు పోస్తే బాగా ఎదుగుతాయి.
- మొక్క ఎదుగుదల అంతా నత్రజనిమీదే ఆధారపడి ఉంటుంది. పూత, పిందె రాలిపోవడం, ఆకులు చిన్నవిగా ఉండిపోతుంటే నైట్రోజన్ లోపించిందని అర్థం చేసుకోవాలి. ఇలాంటప్పుడు ఆవుపేడ, కాఫీ పొడి వంటివివేయాలి.
- ఆకులపై మచ్చలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వంటివి కనిపిస్తే...వంట సోడాను నీళ్లల్లో కలిపి మొక్క మొదళ్లలో చల్లండి సమస్య దూరమవుతుంది. అదే ఆకు పురుగు వస్తే...సర్ఫ్ నీళ్లను స్ప్రే చేయడం ద్వారా సమస్యను తగ్గించుకోవచ్చు.
- ఆకులు కాలినట్లుగా, ముడుచుకుపోతుంటే ఓ వారం పాటు మొక్కకు పోసే నీటిలో కొద్దిగా ఈస్ట్‌ను కలిపి పోయండి. మళ్లీ ఆరోగ్యంగా కనిపిస్తుంది. లేదా కాస్త పల్చటి మజ్జిగను మొక్కలకు అందిస్తే చాలు సూక్ష్మపోషకాలెన్నో అందుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.