ఇల్లంతా త్రివర్ణ శోభ

సందర్భానికి తగ్గట్లు ఇంటి అలంకరణను మార్చడం మనకు అలవాటే! ఈ మార్పు మనసుకెంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఈసారి దేశభక్తి ప్రతిబింబించేలా సర్దుకొని చూడండి.. ఆ స్ఫూర్తి మనసంతా నిండుతుంది. ఎలాగంటారా..

Published : 15 Aug 2023 00:16 IST

సందర్భానికి తగ్గట్లు ఇంటి అలంకరణను మార్చడం మనకు అలవాటే! ఈ మార్పు మనసుకెంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఈసారి దేశభక్తి ప్రతిబింబించేలా సర్దుకొని చూడండి.. ఆ స్ఫూర్తి మనసంతా నిండుతుంది. ఎలాగంటారా.. ఇదిగో ఇలా!

  • ముందుగా ఫ్రీడం వాల్‌ ఆర్ట్‌ను ఎంపిక చేసి హాలుకి అమర్చాలి. పడక గదిలోనూ ఈ సూత్రాన్ని అనుసరించొచ్చు. సోఫాలో కుషన్స్‌కు మూడు రంగుల కవర్లను వేస్తే చాలు. కిటికీ కర్టెన్లుగా ప్లెయిన్‌లో నారింజ, తెలుపు, ఆకుపచ్చ రంగులను వేయాలి.  దీంతో ఇల్లంతా త్రివర్ణ శోభతో కళకళలాడుతుంది.
  • మూడు తెల్లని కాగితాలు తీసుకొని ఒకదానికి నారింజ, మరొకదానికి ఆకుపచ్చ రంగులేసి ఆరనివ్వాలి. మొత్తం మూడింటిని కత్తిరించి చిన్న బెల్స్‌లా జిగురుతో అతికించాలి. వీటిని వాల్‌ హ్యాంగింగ్స్‌లా వేలాడదీసుకుంటే సరి.
  • టీపాయి, భోజనబల్లపైన మూడురంగుల కొవ్వొత్తులు సర్ది, టేబుల్‌ క్లాత్స్‌కూ త్రివర్ణాలుండేలా ఎంపిక చేసుకున్నా మువ్వన్నెలా కళ వచ్చేసినట్లే. వాజ్‌నూ అందంగా మార్చాలంటే కొన్ని గులకరాళ్లకు విడివిడిగా జెండాలోని మూడు రంగులు వేసి ఆరనిచ్చి వాజ్‌ను నింపాలి. ఇందులో తాజా పూలను సర్ది డ్రెస్సింగ్‌ టేబుల్‌పై ఉంచితే చాలు. ఇల్లంతా స్వాతంత్య్ర దినోత్సవ సందడితో నిండిపోయినట్లే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని