స్నానాల గదికి.. సహజ శుభ్రత
బాత్రూమ్‌ని శుభ్రంగా ఉంచడానికి ఎన్నో ఉత్పత్తులు వాడతాం. కానీ వాటిల్లోని రసాయనాలు అందరికీ పడవు. గాఢమైన వాసన, తల తిరగడం, కడుపులో తిప్పడం వంటివాటికీ కారణమవుతాయి.
బాత్రూమ్‌ని శుభ్రంగా ఉంచడానికి ఎన్నో ఉత్పత్తులు వాడతాం. కానీ వాటిల్లోని రసాయనాలు అందరికీ పడవు. గాఢమైన వాసన, తల తిరగడం, కడుపులో తిప్పడం వంటివాటికీ కారణమవుతాయి. సహజమైన వాటితోనూ.. లోతైన శుభ్రత సాధ్యమేనని తెలుసా?
కప్పు వైట్ వెనిగర్‌కి రెండు స్పూన్ల చొప్పున బ్లీచ్, బేకింగ్‌సోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో పోసి, స్నానాల గది గోడలు, నేల మీద చల్లి బ్రష్‌తో సమంగా పరచుకునేలా రుద్దాలి. గంటపాటు అలాగే వదిలేసి, ఆపై కొద్దిగా నీళ్లు పోస్తూ రుద్ది కడిగితే మొండి మరకలు పోతాయి.
⚛ అరమగ్గు గోరువెచ్చని నీటికి రెండు టేబుల్ స్పూన్ల లిక్విడ్ డిష్‌వాష్, టేబుల్ స్పూను బేకింగ్ సోడా, నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ కొన్ని చుక్కలు వేసి, బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని సింకులు, ట్యాపులపై చల్లి, పావుగంట అయ్యాక కడిగేయండి. మెరవడమే కాదు.. బాత్రూమ్ సహజ పరిమళాలతో నిండిపోతుంది!
⚛ సింకు వద్ద చిన్న అద్దాన్ని ఏర్పాటు చేసుకుంటాం కదా! అదేమో నీళ్లు, సబ్బు మరకలతో నిండిపోతుంది. వదలగొట్టాలంటే.. కప్పు నీటికి అరకప్పు వైట్ వెనిగర్, చెంచా కార్న్‌ఫ్లోర్ కలిపి స్ప్రే బాటిల్‌లో పోసుకోండి. దాంతో స్ప్రే చేసి ఏదైనా బ్రష్‌తో అద్దమంతా రుద్దాలి. పూర్తిగా ఆరనిచ్చి మెత్తని పొడి వస్త్రంతో తుడిస్తే సరి.
⚛ ఇక టాయ్‌లెట్.. కప్పు వైట్ వెనిగర్‌కి అరకప్పు బేకింగ్ సోడా, రెండు స్పూన్ల చొప్పున నిమ్మరసం, లిక్విడ్ డిష్‌వాష్ కలిపి, లోపలా, బయటా రుద్ది కాసేపు వదిలేయండి. తర్వాత మరోసారి రుద్ది కడిగితే పసుపు మరకలు మాయం అవుతాయి. బ్లీచ్‌కి కాస్త గాఢమైన వాసన ఉంటుంది. తట్టుకోలేమనిపిస్తే కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్‌ని కలిపితే సరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.