సరిగానే సర్దారా?
సరిత కాలేజీకి సిద్ధమయ్యే ప్రతిసారీ తనకు సరైన దుస్తులు లేవనుకుంటుంది. అలేఖ్య ఆఫీస్‌లో ముఖ్యమైన సమావేశానికి వెళుతున్నపుడల్లా బ్లేజర్స్ కోసం వెతుక్కుంటుంది.
సరిత కాలేజీకి సిద్ధమయ్యే ప్రతిసారీ తనకు సరైన దుస్తులు లేవనుకుంటుంది. అలేఖ్య ఆఫీస్‌లో ముఖ్యమైన సమావేశానికి వెళుతున్నపుడల్లా బ్లేజర్స్ కోసం వెతుక్కుంటుంది. అలమరా నిండా దుస్తులున్నా.. సరైన నిర్వహణ లేకపోవడం వల్లే వీళ్లకీ సమస్య. అలా కావొద్దంటే..
కాలేజీ, ఆఫీసు సెలవు రోజున లేదా వారంలో కనీసం ఒక్కసారైనా వార్డ్‌రోబ్ శుభ్రం చేయడం పనిగా పెట్టుకోవాలి. మొదటిసారి ఎక్కువ సమయం పట్టినా.. ప్రతి వారం చేస్తోంటే పని తేలికవుతుంది. ఏది ఎక్కడ పెట్టామన్న స్పష్టతా ఉంటుంది. ముందుగా దుస్తులన్నింటినీ బయటకు తీసి, అలమరలను తుడవాలి. దుస్తులను విడిగా తీసి గాలికి ఆరనివ్వాలి. అప్పుడే వాటిలో చెమ్మ దూరమై ఎక్కువ కాలం మన్నుతాయి. ఒక ఖాళీ అట్టపెట్టెను పక్కన పెట్టుకొని.. వినియోగించని, బిగుతుగా మారిన లేదా పాతబడిన వాటన్నింటినీ అందులో వేయాలి. వాటిని పేద పిల్లలకు, అనాథాశ్రమానికి అందిస్తే సరి. నిరుపయోగంగా వార్డ్‌రోబ్‌లోనే ఉండకుండా అవసరమైనవారికి ఉపయోగపడతాయి.
- సీజన్‌కు.. కాలాలకు తగ్గట్టుగా కొన్ని దుస్తులను ఎంచుకుంటాం. వాటిని విడదీయాలి. రోజూవారీ వినియోగించే లెగ్గింగ్స్, స్కర్టులు, ప్యాంట్స్, గౌన్లు వంటివన్నీ ఓ చోట ఉంచాలి. ప్రస్తుత కాలానికి తగ్గవాటిని ఎదురుగా కంటికి కనిపించేలా సర్దుకోవాలి. మిగతావాటిని కింది అరల్లో పెడితే సరి. ప్రతిరోజూ దుస్తులపై కావాల్సిన టాప్స్, బాటమ్స్, జాకెట్స్ వంటివి చేతికందేలా ఉంచితే వెతుక్కోవాల్సిన పని ఉండదు. డ్రెస్సింగ్ కూడా త్వరగా పూర్తవుతుంది.
- ప్రత్యేకంగా.. స్కార్ఫ్‌లు, దుపట్టాలకు ప్రత్యేక రింగ్స్ వస్తున్నాయిప్పుడు. వార్డ్‌రోబ్ తలుపు లోపలి వైపున వీటిని బిగించి, దుపట్టాలు వంటివి తగిలిస్తే చోటు మిగులుతుంది. మ్యాచింగ్ కోసం అలమరా అంతా చిందర వందర చేయాల్సిన అవసరం ఉండదు. జాకెట్లు, బ్లేజర్లు వంటివి హ్యాంగర్స్‌కు తగిలించాలి. వీటిని పొడవుగా ఉండే అలమరలో వేలాడదీస్తే ఏది దేని మీదకు అనువో తేలిగ్గా గుర్తించొచ్చు. ఓ అట్టపెట్టెలో లోదుస్తులుంచి దాన్ని అలమరలో సర్దితే, అవసరమైనప్పుడు తేలికగా తీసుకోవచ్చు. సమయమూ మిగులుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.